మోదీ వ్యాక్సిన్ టూర్ : భారత్ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని.. కోవ్యాగ్జిన్ పురోగతిపై ఆరా

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు.హకీంపేట్ విమానాశ్రయంలో దిగిన ఆయనకు హకీంపేట్ ఎయిర్‌ ఆసిఫ్ చీఫ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి ఆయన నేరుగా జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌ ప్లాంట్‌ను సందర్శించారు. అక్కడ అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్ పురోగతి వివరాలను సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు.దాదాపు గంట పాటు బయోటెక్ ఫార్మా ప్లాంట్‌లో గడిపారు.

Recommended Video

    PM Modi visits Bharat Biotech | PM Modi In PPE kit, Reviews COVID vaccine development

    భారత్ బయోటెక్ సైంటిస్టులు వ్యాక్సిన్ పురోగతిపై తనకు వివరాలు వెల్లడించినట్లు ప్రధాని ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇప్పటివరకూ సాధించిన ఫలితాలపై సైంటిస్టులకు అభినందనలు తెలిపినట్లు చెప్పారు. త్వరితగతిన వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ టీమ్ పనిచేస్తున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ సందర్శన అనంతరం ప్రధాని మోదీ పుణే బయలుదేరారు.

    పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించనున్న ప్రధాని మోదీ... అక్కడ అభివృద్ది చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ కోవీషీల్డ్ వ్యాక్సిన్‌తో పాటు, కోవ్యాక్సిన్ వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.వాటిపై సమీక్ష జరిపే అవకాశం ఉంది. కరోనాపై పోరులో కీలకంగా మారనున్న వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ వాడకానికి ఉపయోగించే అవకాశం ఉన్నందునా... వాటి సన్నద్దతను పరిశీలించేందుకే ప్రధాని వ్యాక్సిన్ టూర్‌ చేపట్టారు. వ్యాక్సిన్ టూర్‌పై ఈ సాయంత్రం ఆయన ట్విట్టర్ ద్వారా లేదా అధికారిక ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

     PM Modi Vaccine Tour, visited bharat biotech Plant In hyderabad

    అంతకుముందు, మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అక్కడి చంగోదర్ పారిశ్రామిక ప్రాంతంలోని జైదుస్ క్యాడిలా బయోటెక్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అభివృద్ది చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ 'జైకోవ్-డి'పై సమీక్ష జరిపారు. పీపీఈ కిట్ ధరించి ‌ప్లాంట్‌లోకి వెళ్లిన ఆయన వ్యాక్సిన్ అభివృద్ది ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.దాదాపు ఒక గంట సమయం పాటు మోదీ అక్కడ గడిపారు.మొదటి దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసిన జైదుస్ క్యాడిలా.. ఈ ఏడాది అగస్టు నుంచి రెండో దశ ప్రయోగాల్లో తలమునకలైంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+