గ్రీటింగ్స్: అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ, అమిత్ షా
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అద్వానీ 88వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోడీ... అద్వానీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ అత్యంత గౌరవనీయులని, మార్గదర్శిగా, ఉత్తేజాన్ని ఇచ్చిన స్ఫూర్తి ప్రధాతగా నిలుస్తారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు.

అపారమైన జ్ఞానసంపత్తి, రుజువర్తన అద్వానీ సొంతమని కొనియాడారు. వ్యక్తిగతంగా అద్వానీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తన జీవితంలో అత్యుత్తమ గురువు ఆయనేనని ప్రధాని మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. అమిత్ షా కూడా అద్వానీ ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications