వైమానిక దళ పరాక్రమం- ప్రతిధ్వనించిన వారణాసి

వైమానిక దళం 94వ వార్షికోత్సవ వేడుకలు ఉత్తరప్రదేశ్‌ వారాణసిలో వైభవంగా ప్రారంభం అయ్యాయి. పవిత్ర కాశీలోని నమో ఘాట్ వేదికగా నిర్వహించిన వింగ్స్ ఓవర్ గంగెస్ పేరుతో చేపట్టిన వైమానిక విన్యాసాల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా తిలకించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు, వైమానిక దళ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

ఈ ఎయిర్ షోలో వాయుసేనకు చెందిన వివిధ రకాల వార్ ఎయిర్ క్రాఫ్ట్స్, రవాణా విమానాలు ఒకదాని వెంట ఒకటి గాల్లోకి లేచి విన్యాసాలు సాగాంచాయి. అంబరంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాయి. వైమానిక దళ పైలట్లు చేసిన ఈ ఫార్మేషన్లు వీక్షకులను ఎంతగానో మైమరిపించాయి. తేజస్, రఫేల్, సుఖోయ్ సు 30 ఎంకేఐ, మిరాజ్ వంటి ప్రతిష్టాత్మక యుద్ధ విమానాలు గగనతలంలో చేసిన విన్యాసాలు మంత్రముగ్ధులను చేశాయి.

PM Modi witness the Air Force Day Aerial Display 2026 at Namo Ghat in Varanasi Wings over Ganges

కైలాష్ ఫార్మేషన్ లో భాగంగా సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానం వీ ఆకారంలో కనిపించగా.. దానికి ఇరువైపులా ఏఎన్-32 రవాణా విమానాలు నిలిచి వాయుసేన బలాన్ని ప్రదర్శించాయి. స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలు అద్భుతమైన ఏరోబాటిక్ విన్యాసాలు అద్భుత రీతిలో సాగాయి.

బ్యాంకింగ్ లో నూతన అధ్యాయం: రేపు ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ప్రారంభం
బ్యాంకింగ్ లో నూతన అధ్యాయం: రేపు ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ప్రారంభం

పవిత్ర గంగానది అలల పైన నిర్వహించిన ఈ వైమానిక ప్రదర్శనను వీక్షించడానికి వేలాది మంది ప్రజలు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో నమో ఘాట్ కు తరలివచ్చారు. వాయుసేనకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు నింగిలో చేసిన విన్యాసాలు కాశీ నగరాన్ని మంత్రముగ్ధులను చేశాయి. దేశ రక్షణలో వాయుసేన శక్తిసామర్థ్యాలు, సైనికుల పోరాట పటిమను ప్రతిబింబించేలా సాగిన ఈ విన్యాసాలు.. కట్టిపడేశాయి.

టీమిండియాతో టీ20 సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ
టీమిండియాతో టీ20 సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ

ఈ వైమానిక ప్రదర్శనలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో శరవేగంగా దూసుకెళ్తూ తేజస్ చేసిన విహంగ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రక్షణ రంగానికి సంబంధించి భారత్ సాధిస్తున్న ఆత్మ నిర్భరతకు తేజస్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. తేజస్ చేసిన భీకర గర్జన వారణాశి నగరం అంతటా కూడా ప్రతిధ్వనించింది.

తేజస్‌తో పాటు రవాణా హెలికాప్టర్ చినూక్ కూడా ఈ వేడుకల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గంగా నది నీటి ఉపరితల ప్రాంతానికి చేరువగా ఎగురుతూ చినూక్ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు భారత వైమానిక దళ పైలట్ల అసాధారణ నైపుణ్యానికి అద్దం పట్టాయి. అత్యవసర పరిస్థితుల్లో, కష్టతరమైన భౌగోళిక ప్రాంతాల్లో రవాణా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే చినూక్ శక్తి సామర్థ్యాలు ఏమిటనేది ఈ ఎయిర్ షో ద్వారా మరోసారి స్పష్టమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+