వీరాభిమానికి ప్రధాని మోదీ అదిరిపోయే గిఫ్ట్.. ఇది కదా ప్రేమంటే !

హరియాణాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ అద్భుతమైన సంఘటన అందరినీ ఆకట్టుకుంది. 14 ఏళ్ల క్రితం, మోదీ ప్రధాన మంత్రి కావాలని, ఆయన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని శపథం చేసిన ఓ వీరాభిమాని కల నెరవేరింది. ఆ అభిమాని మరెవరో కాదు, హర్యానాకు చెందిన రామ్‌పాల్‌ కశ్యప్.

రామ్‌పాల్‌ కశ్యప్, ప్రధాని మోదీ పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ, మోదీని కలిసేంత వరకు చెప్పులు ధరించనని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుంచి చెప్పులు లేకుండానే జీవితం గడుపుతూ వచ్చారు. ఎట్టకేలకు ఆ సుదినం రానే వచ్చింది. సోమవారం నాడు హరియాణాలో పర్యటించిన ప్రధాని మోదీని రామ్‌పాల్‌ కశ్యప్ కలిశారు.

pm-modis-heartfelt-gesture-fan-who-walked-barefoot-for-14-years-gets-his-wish

ఈ సందర్భంగా జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. రామ్‌పాల్‌ కశ్యప్‌ను చూడగానే మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆయనతో కాసేపు ముచ్చటించారు. అనంతరం రామ్‌పాల్‌ కశ్యప్‌కు బహుమతిగా ఒక జత బూట్లు ఇచ్చారు. అంతేకాకుండా, ఆయనే స్వయంగా ఆ బూట్లు తొడగడానికి సహాయం చేశారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.

ప్రధాని మోదీ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో రామ్‌పాల్‌ కశ్యప్ తెల్లటి కుర్తా-పైజామా ధరించి, చెప్పులు లేకుండా మోదీని కలిసేందుకు వెళుతుండగా, మోదీ ఆయనను ఆప్యాయంగా కరచాలనం చేస్తూ ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి సోఫాలో కూర్చున్న తరువాత, మోదీ రామ్‌పాల్‌ను "ఎందుకు ఇంత కాలం చెప్పులు ధరించలేదు? మిమ్మల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెట్టుకున్నారు?" అని అడిగారు. దానికి రామ్‌పాల్‌ కశ్యప్, తాను 14 ఏళ్లుగా చెప్పులు లేకుండానే ఉన్నానని సమాధానం ఇచ్చారు.

అప్పుడు మోదీ రామ్‌పాల్‌ కశ్యప్‌కు బూడిద రంగు స్పోర్ట్స్ షూలను బహుమతిగా ఇచ్చి, ఇకపై ఇలాంటి శపథాలు చేయవద్దని సూచించారు. "నేను ప్రధానమంత్రి అయిన తరువాతే చెప్పులు ధరిస్తానని 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేసిన రామ్‌పాల్‌ కశ్యప్‌ను ఈ రోజు యమునానగర్‌ బహిరంగ సభలో కలిశాను. ఇలాంటి వ్యక్తుల ఆప్యాయత, ప్రేమను నేను గౌరవిస్తాను. కానీ, ఇలాంటి ప్రమాణాలు చేసే వారందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. మీ ప్రేమను నేను గౌరవిస్తాను. దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి" అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ చూపించిన ఈ అభిమానం, ఆయనలోని మానవత్వాన్ని మరోసారి చాటి చెప్పింది. ఒక అభిమాని పట్ల ఆయనకున్న ప్రేమ, గౌరవం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిజంగానే, ఇది ఒక మరపురాని సంఘటన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+