వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం: ప్రధాని మోడీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సాంబ సభలో ప్రసంగించిన అనంతరం శ్రీనగర్‌లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఇటీవల ఉగ్రవాదులు దాడిలో అమరులైన సైనికులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు.

అనంతరం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అందరం కలసికట్టుగా అభివృద్ధి సాధించాలని, అదే తమ నినాదమని అన్నారు. కాశ్మీర్‌పై మాజీ ప్రధాని వాజ్ పేయి కన్న కలలను నిజం చేద్దామని అన్నారు.

కాశ్మీర్‌లో యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వరదల సమయంలో ఇక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల బాధలే తన బాధలని, ప్రజల కష్టాలను తీర్చడం నా బాధ్యతని మోడీ అన్నారు.

గత 20 సంవత్సరాల్లో కాశ్మీర్‌‍లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రాణత్యాగం చేసిన సైనికులు, పోలీసుల కుటుంబాలకు ఏం చేసినా తక్కువేనని మోడీ అన్నారు. తనపై ప్రేమ చూపుతున్న జమ్మూ కాశ్మీర్ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.

అంతక ముందు సాంబ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఏకె-47 ఆయుధంపై ఉన్న వేలికంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఈవిఎంపై ఉన్న వేలికే ఎక్కువ శక్తి ఉంటుందని అన్నారు. ఇక్కడి పాలకుల వల్లే ఉగ్రవాదం పెరుగుతోందని చెప్పారు. వారసత్వ రాజకీయాలకు అంతం పలికే సమయం వచ్చిందని అన్నారు.

జమ్మూకాశ్మీర్ ప్రజలు హంగ్ అసెంబ్లీకి అవకాశం ఇవ్వవద్దని మోడీ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పూర్తి ఆధిక్యం ఇవ్వాలని ప్రజలను కోరారు. తనపై ప్రేమ చూపిస్తే.. అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా తిరిగి ఇస్తానని మోడీ జమ్మూకాశ్మీర్ ప్రజలనుద్దేశించి అన్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలపై మోడీ విమర్శల వర్షం కురిపించారు.

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో, శ్రీనగర్ సిటీని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోడీ సభకు రక్షణగా 6,000 మంది మిలిటరీ అధికారులతో పాటు.. షార్ప్ షూటర్స్‌ను అడుగడుగునా సైన్యం మోహరించి ఉంది. సభ జరిగే షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియం, చుట్టుపక్కల ప్రాంతాలు నిఘా నీడలో ఉన్నాయి.

ఏరియల్ నిఘా కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. యూరి సెక్టార్లో లష్కరే తోయిబాకు చెందిన మిలిటెంట్లు సైనిక శిబిరంపై దాడి చేసిన నేపథ్యంలో, శ్రీనగర్ ను భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు.

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సాంబ సభలో ప్రసంగించిన అనంతరం శ్రీనగర్‌లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఇటీవల ఉగ్రవాదులు దాడిలో అమరులైన సైనికులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు.

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

అనంతరం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అందరం కలసికట్టుగా అభివృద్ధి సాధించాలని, అదే తమ నినాదమని అన్నారు. కాశ్మీర్‌పై మాజీ ప్రధాని వాజ్ పేయి కన్న కలలను నిజం చేద్దామని అన్నారు.

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

కాశ్మీర్‌లో యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వరదల సమయంలో ఇక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల బాధలే తన బాధలని, ప్రజల కష్టాలను తీర్చడం నా బాధ్యతని మోడీ అన్నారు. గత 20 సంవత్సరాల్లో కాశ్మీర్‌‍లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

అందరం కలసికట్టుగా అభివృద్ధి సాధించాలని, అదే తమ నినాదమని అన్నారు. కాశ్మీర్‌పై మాజీ ప్రధాని వాజ్ పేయి కన్న కలలను నిజం చేద్దామని అన్నారు. కాశ్మీర్‌లో యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

కాశ్మీర్‌పై వాజపేయి కన్న కలలను నిజం చేద్దాం

అంతక ముందు సాంబ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఏకె-47 ఆయుధంపై ఉన్న వేలికంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఈవిఎంపై ఉన్న వేలికే ఎక్కువ శక్తి ఉంటుందని అన్నారు. ఇక్కడి పాలకుల వల్లే ఉగ్రవాదం పెరుగుతోందని చెప్పారు. వారసత్వ రాజకీయాలకు అంతం పలికే సమయం వచ్చిందని అన్నారు.

English summary
Chants of "Modi, Modi" filled the large stadium in Srinagar where the Prime Minister is addressing a rally ahead of tomorrow's voting in the state election. The city has been heavily fortified, the result of last week's serial attacks in different parts of the state, which is voting in five phases for its next government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X