కమిషన్ ప్రభుత్వం కావాలా, నిధులిస్తే ఢిల్లీలోని ఆ పార్టీ పెద్దలకు పంచేశారు, మోడీ ఫైర్!
బెంగళూరు: మీకు లంచాలు తీసుకునే పర్సంటేజ్ ప్రభుత్వం కావాలా ? లేదా అభివృద్ది చేసే ప్రభుత్వం కావాలా అని ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు ఇస్తే ఇక్కడి ప్రభుత్వం వారి సొంత పార్టీకి చెందిన ఢిల్లీలోని పెద్దలకు పంచేశారని మోడీ మండిపడ్డారు. ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇక్కడి సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం కమీషన్లు తీసుకుని ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పర్సంటేజ్ లు పంపించడానికే సమయం కేటాయిస్తోందని, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది పనులు జరగలేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
Recommended Video


కన్నడలో ప్రధాని మోడీ
సోమవారం మైసూరులోని మహారాజ కాలేజ్ మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ కన్నడలో తన ప్రసంగాన్ని మొదలు పెట్టి అందర్నీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.

మైసూరు ఫేమస్
మైసూరు పట్టు, మైసూరు గంధం, మైసూరుపాకు, మైసూరు దసరా ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందినవని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మైసూరు జిల్లా ప్రజలు చాల విద్యావంతులని, ఇక్కడి ప్రజలు భారతదేశంలో అందరికీ ఆదర్శంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

కేంద్రం నిధులు ఎక్కడ?
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి యువతకు స్వయం ఉపాధిపథకాలు కల్పించడానికి కేంద్రం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిందని, అయితే సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం ఆ నిధులు యువత ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఉపయోగించుకోకుండా ఢిల్లీలోని వాళ్ల సొంత పార్టీ నాయకుల యోగక్షేమాలు చూసుకోవడానికి ఉపమోగిస్తున్నారని ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

మైసూరులో రూ. వెయ్యి కోట్లతో!
కర్ణాటక, రాజస్థాన్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ది చెయ్యడానికి సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మైసూరులోని నాగేనహళ్లిలో అంతర్జాతీయ స్థాయిలో రూ. 1,000 కోట్లతో స్యాటిలైట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

డైరీలో కమిషన్ల వివరాలు
ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటిలో ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారని, అందులో ఢిల్లీలోని ఆపార్టీ పెద్దలకు ఎంత మొత్తంలో కమిషన్లు ఇచ్చారు అనే పూర్తివరాలు పూసగుచ్చినట్లు రాసి పెట్టారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.

రూ. 6, 400 కోట్లతో రోడ్లు
మైసూరు చుట్టుపక్కల రూ. 6,400 కోట్ల వ్యయంతో 117 కిలోమీటర్ల పొడవునా ఆరులైన్ల రహదారులు వెయ్యడానికి నిధులు మంజూరు చేశామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నిత్యం కమిషన్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే శాసన సభ ఎన్నికల్లో శాస్వతంగా ఇంటికి పంపించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.

10 కోట్ల మందికి !
ప్రధాన మంత్రి ముద్రా పథకం దేశంలోని 10 కోట్ల మంది యువతకు లాభం చేకూర్చిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటక ప్రజలు కష్టాలు తీర్చకుండా సీఎం సిద్దరామయ్య తన కుర్చీకాపాడుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ప్రజలకు పిలుపు నిచ్చారు.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!











Click it and Unblock the Notifications