మోడీ మనందరికంటే ముందు, కానీ: రఘురాం రాజన్

ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ప్రభావం క్షేత్రస్థాయిలో ప్రతిబింబించాల్సి ఉంటుందని రఘురాం రాజన్ బుధవారం అన్నారు.

ప్రధాని మోడీ మనందరి కన్నా ఎంతో ముందున్నారని కొనియాడారు. ఆయన తన అలోచనలతో మనకన్నా ముందుగా పరుగులు పెడుతున్నారని, భారత్‌లో క్షేత్రస్థాయిలో దాని ఫలితాలు కనిపించాలన్నారు. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు క్షేత్రస్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అప్పుడే ఆయన పర్యటనల ఫలాలు వేగంగా దేశానికి అందుతాయని అభిప్రాయపడ్డారు. భారత్ తరఫున వాదనను ప్రపంచానికి వినిపించేందుకు ప్రధాని మోడీని సరైన వ్యక్తిగా అభివర్ణించారు. పర్యటనలకు ముందే భారత్ పైన సదభిప్రాయం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు.

PM Narendra Modi ahead of us but action on ground needed: Raghuram Rajan

ఓ నిపుణుడైన ఆర్థికవేత్తగా, తాను చేయగలిగిందే చేస్తానన్నారు. మోడీ మనందరికన్నా ఎంతో ముందున్నారని, ఆయనను అందుకోవాలంటే, ఎన్నో కోణాల్లో మనం వేగం పుంజుకోవాలని, ఉదాహరణకు, భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని వెళ్లి, అందులో విజయం సాధిస్తే... పెట్టుబడులతో ఇక్కడికి వచ్చిన కంపెనీలకు అడ్డంకులు ఏర్పడితే? వారి వ్యాపారం చేసుకోవడానికి అనువైన వాతావరణ పరిస్థితి, అనుమతుల లభ్యత, మౌలికవసతుల కల్పనలో విఫలమైతే.. ముందుగా వీటన్నింటిలో సమస్యలు అధిగమించిన తర్వాతనే పెట్టుబడుల కోసం యత్నిస్తే మేలు కలుగుతుందన్నారు.

భారత్ కొన్ని విషయాల్లో వెనుకబడివున్నప్పటికీ, అంచనా వేస్తున్నంత ఘోరమైన పరిస్థితులు లేవన్నారు. భారత్‌లో కొన్ని సమస్యలు ఉంటాయని విదేశీయులు భావిస్తుంటారని, ఇక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి వారి అంచనాల కన్నా అధ్వాన్నంగా ఉండకూడదన్నారు.

ఆర్బీఐకి, ప్రభుత్వానికి బలీయమైన బంధం ఉందన్నారు. అన్ని సందర్భాల్లో తాను ఆర్థిక మంత్రి అభిప్రాయాలతో ఏకీభవించబోనన్నారు. అలా చేస్తే, ఆర్బీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అనే అభిప్రాయం ఏర్పడేందుకు తావుంటుందని, కొన్ని సందర్భాల్లో నేను గేట్ కీపర్ వలె కూడా వ్యవహరిస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+