మోడీ సంచలన నిర్ణయం: ఒలింపిక్స్ కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రీడల్లో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఒలింపిక్స్ కోసం ప్రణాళిక సిద్ధం చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.
రియో ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై విమర్శల నేపథ్యంలో క్రీడలను ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. 2020, 2024, 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని క్రీడాకారులను సన్నద్ధం చేసేందుకు ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

క్రీడాకారులకు కావాల్సిన క్రీడా సదుపాయాలు, శిక్షణ, ఎంపిక విధానం తదితర అన్ని విషయాలపై వీరు ఎప్పటికప్పుడు టాస్క్‌ఫోర్స్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించనుంది. ఈ యాక్షన్ ప్లాన్‌తో ఒలింపిక్స్‌లో భారత్ మెరవనుంది. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.
వంద మందికి పైగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల్లో ఇద్దరు మాత్రమే పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పీవీ సింధు రజతం సాధించగా, రెజ్లింగ్‌లో హర్యానాకు చెందిన సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పూర్తిగా నిరాశపరిచారు. దీంతో మేలుకున్న కేంద్ర ప్రభుత్వం రాబోయే ఒలింపిక్స్ క్రీడలకు ఇప్పటినుంచే క్రీడాకారులను సన్నద్ధం చేసేందుకు సమాయత్తం అవుతోంది. అటు చైనా వంటి దేశాలు కూడా క్రీడల్లో భారత ప్రదర్శనపై తక్కువ చేసి మాట్లాడటంతో తాజాగా మోడీ నిర్ణయం సంచలనంగా మారింది.
PM @narendramodi ji announced Special Task Force for next 3 Olympics in today's Council of Minister meeting. pic.twitter.com/EBuBBn350c
— Kiren Rijiju (@KirenRijiju) August 26, 2016
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications