ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నేటి సాయంత్రం కేబినెట్ భేటీ
న్యూఢిల్లీ: మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ఈ సమాచారాన్ని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. అంతేగాక, ఇతర రాజకీయ పరిస్థితులపైనా చర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయం జనవరి మొదటి వారంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన చివరి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో, దేశంలోని 15-18 సంవత్సరాల మధ్య వయస్కులైన కౌమార జనాభా కోసం టీకాలు వేసే కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

60 ఏళ్లు పైబడిన జనాభాకు, కొమొర్బిడిటీలు ఉన్న వారికి వైద్యుల సూచనతో కోవిడ్-19 వ్యాక్సిన్ మూడవ షాట్(ముందు జాగ్రత్త మోతాదు)ను కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం జరగనున్న కేబినెట్ భేటీలోనూ దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో కీలక మంత్రులు పాల్గొననున్నారు.
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తాజాగా, దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. భారతదేశంలో సోమవారం 30,000 కంటే తక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 27,409 తాజా ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, 82,817 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Union Cabinet chaired by PM Narendra Modi likely to meet at 4 pm today
— ANI (@ANI) February 15, 2022
గత 24 గంటల్లో కరోనా బారినపడి 347 మంది మరణించారు. ఇన్ఫెక్షన్‌లలో రోజువారీ తగ్గుదల, అధిక రికవరీ రేటుతో, దేశం రోజువారీ పాజిటివిటీ రేటు రేటు ఇప్పుడు 2.23 శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 4,23,127 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు దేశంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4,17,60,458కు చేరింది. దేశంలో ఇప్పటి వరకు 173.42 కోట్ల డోసులు పంపిణీ చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications