ఇది అనుకున్నంత సాధారణ విషయేం కాదు: నరేంద్రమోడీ
ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా అవతరించడం సాధారణమైన ఘనత కాదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మనం మరిన్ని లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఈ ఐదోస్థానం కల్పిస్తుందన్నారు. ప్రతి భారతీయుడు గర్వపడే విషయమని, ఇదే ఉత్సాహాన్ని, ఇదే పనితీరును మున్ముందు కూడా కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
సూరత్ లో మెగా మెడికల్ క్యాంప్ ను మోడీ వర్చువల్ గా ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని పేదప్రజల కోసం ఎనిమిది సంవత్సరాల్లో 3 కోట్ల ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. 10లక్షల ఇళ్లు గుజరాత్‌లోనే ఉన్నాయని, రాష్ట్రంలో 97శాతం కుటుంబాలకు కుళాయి నీళ్లు అందుతున్నాయన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామన్నారు.

ఇటీవలి సర్వేల్లో గుజరాత్ కు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులువేం కాదంటూ అభిప్రాయాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ కన్నా ఆప్ నుంచే గట్టి పోటీ ఎదురవబోతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడు రోజుల క్రితమే సూరత్ లో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సర్వేలన్నీ వ్యతిరేకంగా వస్తుండటంతో మోడీ దృష్టిసారించారని, అందుకే సూరత్ లో మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్-ఇండియా గేట్ మధ్య ఉండే కర్తవ్య పథ్ మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా రాజ్ పథ్ పేరు మార్చి అభివృద్ధి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా మోడీ ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications