మరింత బలోపేతం: ట్రంప్‌కు మోడీ శుభాకాంక్షలు
అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో అమెరికాను విజయాల దిశగా నడిపించాలంటూ శుక్రవారం రాత్రి ట్విట్టర్‌లో మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
Congratulations @realDonaldTrump on assuming office as US President. Best wishes in leading USA to greater achievements in the coming years.
— Narendra Modi (@narendramodi) 20 January 2017
భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి ప్రయోజనాలు, విలువలపైనే రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య బలం ఉంటుందని మోడీ ట్వీట్ చేశారు.

తమ ఉద్యోగాలను భారతీయులు ఎగరేసుకుపోతున్నారని పలుమార్లు ఆరోపించినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నికల ప్రచార సమయంలో భారతదేశం పట్ల తన సానుకూల భావనను చాటుకున్న విషయం తెలిసిందే. భారత్ గొప్ప దేశమని, తనకు ఆ దేశమంటే ఎనలేని గౌరవమని చెప్పుకొచ్చారు.
Strength of the India-USA strategic partnership lies in our shared values and common interests.
— Narendra Modi (@narendramodi) 20 January 2017
Looking forward to working with President @realDonaldTrump to further deepen India-US ties & realise the full potential of our cooperation.
— Narendra Modi (@narendramodi) 20 January 2017
వైట్ హౌజ్‌కు భారతీయులు, హిందువులు దగ్గర మిత్రులని ట్రంప్ చెప్పారు. అంతేగాక, మోడీపైనా ఆయన ప్రశంసలు కురిపించారు. భారతదేశంలో అనేక సంస్కరణలు చేపడుతున్న శక్తివంతమైన ప్రధాని మోడీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మోడీ ఒక గొప్ప నాయకుడని ప్రశంసించారు. అమెరికా శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకోవడంలో భారతీయులు, హిందువులది ప్రమఖ పాత్ర అని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications