Twitter: ప్రధాని మోడీ హవా, ఏకైక భారతీయుడు, అమెరికా అధ్యక్షుడి తర్వాత ఈయనే

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రధాని మోడీకి దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షలాది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనా పరమైన, సామాజిక అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉంటారు.

ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్‌లో ప్రధాని మోడీ మరో మైలురాయిని అధిగమించారు. ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతాను ప్రస్తుతం 60 మిలియన్ల(6కోట్లు) మందికిపైగా అనుసరిస్తున్నారు. దీంతో అత్యధిక ఫాలోవర్స్ కలిగివున్న ప్రపంచ రాజకీయ నాయకుల్లో నరేంద్ర మోడీ మూడో స్థానంలో నిలిచారు.

 PM Narendra Modi crosses 60 million followers on Twitter

కాగా, 120 మిలియన్ ఫాలోవర్స్ తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలువగా, 83 మిలియన్ ఫాలోవర్లతో ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇక భారతదేశంలో చూస్తే మోడీనే అత్యధిక ఫాలోవర్లు కలిగివున్న ఏకైక నాయకుడు కావడం విశేషం.

Recommended Video

    Rajnath In Leh : 'Talks Are On But Can’t Guarantee Outcome' || Oneindia Telugu

    గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2009లో నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతా తెరిచారు. 2014లో మోడీ ప్రధాని పదవి చేపట్టడంతో ట్విట్టర్లో ఆయన పాపులారిటీ మరింతగా పెరిగింది. దీంతో ఆయన ఫాలోవర్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగుతూనే ఉంది. ఇక ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా 37 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+