ప్రధానిగా మోడీ వేతనం 1.6 లక్షలు, తల్లి గిఫ్ట్ రూ.101

న్యూఢిల్లీ: కాబోయే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలకు రూ.1.6 లక్షలు వేతనం పొందనున్నారు. ఆంగ్ల పత్రికల ప్రకారం... ఆయన బేసిక్ శాలరీ రూ.50,000, భత్యం రూ.3,000, దినసరి అలవెన్సెస్ రూ.62,000, ఎంపీ అలవెన్సెస్ రూ.45,000గా ఉన్నాయి.

2013లో ఆర్టీఐ భారత ప్రధానికి ఇచ్చే శాలరీ, ఇతన అలవెన్సుల గురించి వివరాలు సేకరించింది. పైన చెప్పిన శాలరీ, ఇతర అలవెన్సులతో పాటు పర్సనల్ స్టాఫ్, స్పెషల్ జెట్, ప్రభుత్వ నివాసం తదితర సదుపాయాలు కూడా ఉంటాయి. ఎస్పీజీ యాక్ట్ ప్రకారం... ప్రధానమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు భారీ సెక్యూరిటీని ఇస్తారు.

PM Narendra Modi to draw Rs 1.6 lakh per month salary

మోడీ ప్రధానమంత్రి కాబోతున్నందున ఆయన నివాసం మారనుంది. ఇప్పటికే ఆయన గుజరాత్ నుండి ఢిల్లీకి మారారు. ఢిల్లీ మధ్యలో ఉన్న 7 రేస్ కోర్సు రోడ్డులో ఆయన నివాసం ఉంటుంది. మోడీ కార్యాలయం రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్‌లో ఉంటుంది.

కాగా, నరేంద్ర మోడీ గురువారం తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. తనయుడికి ఆశీస్సులు అందించిన హీరా రూ.101 ఇచ్చింది. అనంతరం గుజరాత్ నుండి ఢిల్లీకి బయలుదేరే సమయంలో 'ఆవ్జో గుజరాత్' (గుడ్ బాయ్ గుజరాత్) అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+