మాజీ సీఎంకు సుదీర్ఘ లేఖ రాసిన ప్రధాని మోదీ, లేఖలో ఏముంది అంటే?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఒకరికి ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రిగా, నీటిపారుదల శాఖా మంత్రిగా, హోం మంత్రిగా మీరు పలు బాధ్యతలు నిర్వహించారని, ఇప్పుడు మా బృందంలో చేరడానికి ఎంపీగా పోటీ చెయ్యడం మాకు గొప్ప బలమని ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. మాజీ సీఎంకు ప్రధాని మోదీ లేఖ రాయడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హవేరీ-గదగ్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బోమ్మయ్ కి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లేఖ రాశారు. లోక్ సభ ఎన్నికల్లో మీరు ఘన విజయం సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మీరు ఎంపీగా కేంద్రం బృందంలో చేరుతున్నందుకు తాను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానని మోదీ అన్నారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, హోంమంత్రి, న్యాయశాఖా మంత్రిగా మీరు ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారని ప్రధాని మోదీ సుదీర్ఘ లేఖలో వివరించారు.

PM Narendra Modi has written a special letter to former Karnataka CM Basavaraj Bommai

హావేరి జిల్లా శిగ్గావిలో సుమారు 30 వేల ఎకరాలకు నీరందించారని, మీ నియోజకవర్గంలో సిమెంటు రోడ్లు, విద్యాసంస్థలు నిర్మించారని, కోవిడ్‌ విషయంలో సొంత ఇంటిని కోవిడ్‌ కేంద్రంగా మార్చారని, ఆసుపత్రులపై భారం తగ్గించారని ప్రధాని మోదీ మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని ప్రశంసించారు. చేనేత కార్మికులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారని ప్రధాని మోదీ మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని పొగిడారు.

PM Narendra Modi has written a special letter to former Karnataka CM Basavaraj Bommai

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశారని, ఉద్యమకారుడిగా మీరు సాధించిన అనుభవం, ప్రజాసేవకుడిగా మీరు చేసిన సేవ కేంద్రంలో మా అభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మీరు ఎంపీ అయ్యి దేశాభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నానని, మీరు పార్లమెంటేరియన్‌గా మా బృందంలో సభ్యుడిగా రావడం మాకు గొప్ప ఆస్తి అని, హావేరి నియోజకవర్గం, దేశాభివృద్ధికి మా బృందం కృషి చేస్తుందని, మీ నియోజకవర్గ ప్రజలకు ఈ లేఖ ద్వారా నేను అన్ని హామీలు ఇస్తున్నానని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి రాసిన లేఖలో ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు వారం రోజుల ముందు మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాయడంతో హావేరి జిల్లా ప్రజలు మంచి హుషారుతో ఉన్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+