PM: ఎక్స్ ప్రెస్ హైవేని ప్రారంభించిన ప్రధాని మోదీ, గంటలోనే కారు పల్టీ, బిత్తరపోయిన ప్రజలు !

బెంగళూరు/మైసూరు: వందల కోట్ల రూపాయల వ్యయంతో బెంగళూరు- మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే రహదారిని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆదివారం మండ్యలోని గెజ్జలగెరెలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కోట్లాది రూపాయలతో నిర్మించిన బెంగళూరు-మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే రహదారిని ప్రారంభించడంతో అందరూ సంతోషించారు. అయితే గంటల వ్యవదిలోనే హైవే మీద కారు బోల్లా పడటంతో అందరూ బిత్తరపోయారు.

అయితే రహదారి ప్రారంభం అయిన కొద్దిసేపటికే బెంగళూరు- మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై కారు ప్రమాదానికి గురైంది. బెంగళూరు-మైసూరు హైవే ఫ్లై ఓవర్‌పై ఓ కారు బోల్తా పడటంతో ప్రజలను భయాందోళనకు గురి చేసింది. మండ్య జిల్లా మద్దూరు తర్వాత ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్‌ సమీపంలోనే కారు బోల్తా పడింది. కారు బెంగళూరు నుంచి మైసూరు వైపు వేగంగా వెళ్తుండగా ఫ్లై ఓవర్ సమీపంలో కారు అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది.

PM Narendra Modi inaugurated the Bengaluru- Mysuru Express Highway. The car overturned on the highway within hours.

డ్రైవర్ కారును అదుపు చెయ్యలేకపోవడంతో బ్యారికేడ్లను ఢీకొట్టింది. బ్యారికేడ్లను ఢీకొనడంతో కారు బోల్తా పడింది. కారులో ఉన్న ముగ్గురికి గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేపై సేఫ్టీ బ్యారియర్‌లు వేయడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం ముగిసిన వెంటనే హైవేపై వాహనాలు సంచరించడానికి పోలీసులు అనుమతించారు. దీంతో బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం నేపథ్యంలో మండ్య జిల్లా యంత్రాంగం ఆదివారం ఉదయం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ప్రెస్ హైవే రహదారిని జాతికి అంకితం చేసిన కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో ప్రజలు, బీజేపీ నాయకులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+