వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాహుబలి సేవలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర బడ్జెట్ జపం, ప్రపంచంలోనే అతిపెద్ద!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi at Shravanabelagola for 'Bahubali Mahamasthakabhisheka Mahotsava'

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన 'ఆయుష్మాన్ భారత్ 'భీమా పథకం ప్రపంచంలోనే అతి పెద్ద పథకం అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని శ్రావణబెళగోళలోని విధ్యగిరి కొండ మీద బాహుబలికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ అనంతంరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ గురించి ప్రస్తా వించారు.

కుటుంబం మొత్తం!

కుటుంబం మొత్తం!

ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైతో అతని కుటుంబంలోని అందరూ అప్పులు కూపంలో కూరుకుపోతారని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఒక్కరి కారణంగా కుటుంబం మొత్తం అవస్థలు పడకూడదని, పేదలు, మధ్య తరగతి వారిని ఆదుకోవాలని ఆయుష్మాన్ భారత్ భీమా పథకం ప్రవేశపెట్టామని నరేంద్ర మోడీ వివరించారు.

 సామాజిక, ధార్మికం కలిసే

సామాజిక, ధార్మికం కలిసే

భారతదేశంలో సామాజిక కార్యక్రమాల కంటే ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వాదన తప్పు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే సామాజిక, ధార్మిక కార్యక్రమాలు కలిసే ముందుకు వెలుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

పురాతన కాలం

పురాతన కాలం

భారతదేశంలో పురాతన కాలం నుంచి మునులు, రుషులు ధార్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే వచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. దానికి తోడు విద్య, ఆరోగ్య రంగాల్లో వారు అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

పుణ్యం చేశాను

పుణ్యం చేశాను

శ్రావణబెళగోళలో బాహుబలికి జరుగుతున్న మహామస్తకాభిషేకం ఉత్సవాలకు హాజరుకావడానికి తాను పుణ్యం చేసుకున్నానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ గోమటేశ్వురుడి శ్లోకాలు చెప్పడంతో ఆ ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది.

ప్రజలకు అంకితం

ప్రజలకు అంకితం

కేంద్రం శ్రావణబెళగోళ అభివృద్దికి చేతనైన సహాయం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో విధ్యగిరి కొండ మీదకు చేరుకోవడానికి నిర్మించిన 630 కాలినడక మెట్లు, బాహుబలి ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

English summary
PM Narendra Modi inaugurates 630 steps of Vindyagiri hill. He participated in Bahubali Mahamastakabhisheka function. In this occasion he remembers social worker of Sant's and Muni's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X