వాట్సాప్ ఛానెల్లోకి నరేంద్ర మోడీ ఎంట్రీ: తొలి పోస్ట్ ఇదే, భారీ సంఖ్యలో ఫాలోవర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తాజాగా, తీసుకువచ్చిన 'ఛానెల్స్'లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరారు. దీంతో ప్రధానికి సంబంధించిన సమాచారన్నంతా వాట్సాప్ వినియోగదారులు సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా తొలిసారి పోస్ట్ చేశారు ప్రధాని మోడీ.
వాట్సాప్ కమ్యూనిటీలో చేరడం ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు. 'మీతో కలిసేందుకు మరింత దగ్గరవుతున్నా'నంటూ.. కొత్త పార్లమెంట్లో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు ప్రధాని మోడీ. కాగా, దేశంలో అత్యధికంగా సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు. తాజాగా, వాట్సాప్‌లో ఎంట్రీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే భారీ సంఖ్యలో ఫాలోవర్లుగా చేరడం గమనార్హం.

ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్స్ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. మోడీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 91.5 మిలియన్లు(9 కోట్ల 15 లక్షలు) ఉండగా.. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక ట్విట్టర్ ఖాతాను 54 మిలియన్ల (5.4 కోట్ల) మంది ఫాలో చేస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాకు 33.7 మిలియన్ (3.37 కోట్ల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల 26 మిలియన్ (2.6 కోట్లు) దాటింది. కాగా, అంతకుముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వాట్సాప్‌లో జాయిన్ అయ్యారు.
Prime Minister Narendra Modi joins WhatsApp Channels pic.twitter.com/X4DmBc1GxS
— ANI (@ANI) September 19, 2023
వాట్సాప్ ఇటీవలే ఛానెల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్ సహా 150 దేశాల్లో ఫీచర్‌ను ప్రారంభించినట్లు మాతృ సంస్థ మెటా వెల్లడించింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన వారికీ రానుంది.
Sir, following you there as well. It's always great learning to listen you and connect you. You have become an inspiration for many in world and showing all a path to do great in their lives. #ModiHaiToMumkinHai pic.twitter.com/UOnIAn6IAK
— Nishant🇮🇳 (@iNishant4) September 19, 2023
అసలేంటీ వాట్సాప్ ఛానల్?
ప్రస్తుతం వాట్సాప్‌ను పరస్పర కమ్యూనికేషన్ కోసం మాత్రమే వాడేవాళ్లం. ఆ తర్వాత గ్రూప్స్ వచ్చాయి. తాజాగా ఇప్పుడు కొత్తగా ఛానెల్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్విట్టర్, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో ఇది కూడా అలా అన్నమాట. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. మీరు ఫాలో అయినప్పటికీ.. మీ ఫోన్ నంబర్ ఎవరికీ కనిపించదు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications