వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ షాక్..? సోషల్ మీడియాకు గుడ్ బై అంటూ ప్రకటన...

|
Google Oneindia TeluguNews

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాకిచ్చారు. ఈ సారి ప్రతిపక్షానికో, ప్రజలకో కాదు.. నెటిజన్లకు.. అవును.. తాను సోషల్ మీడియా నుంచి తప్పుకోంటున్నానని పేర్కొన్నారు. ఈ ఆదివారం నుంచి నెటిజన్లకు దూరమవుతున్నానని సామాజిక మాధ్యమం ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు సోషల్ మీడియా ద్వారా చేరువైన మోడీ.. సామాజిక మాధ్యమం నుంచి తప్పుకొంటానని పేర్కొనడం చర్చకు దారితీసింది.

Recommended Video

3 Minutes 10 Headlines | World Wildlife Day 2020 | Modi Social Media Accounts Give Up | Oneindia

గుడ్ బై..?

ఆదివారం నుంచి తన ఫేస్‌బుక్, ట్వీట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూ ట్యూబ్ వాడబోమని మోడీ స్పష్టంచేశారు. అరగంట క్రితం ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా నుంచి తప్పుకొంటాననే మోడీ ట్వీట్‌కు కూడా నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. 14 వేల మంది రీ ట్వీట్ చేయగా.. 9 వేల మంది లైక్ చేశారు. ట్వీట్టర్‌లో మోడీకి 53.3 మిలియన్ ఫాలొవర్లు, ఫేస్‌బుక్‌లో 44 మిలియన్ ఫాలొవర్లు ఉన్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కూడా 30 మిలియన్ మందితో టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

మోడీ తర్వాతే..

మోడీ తర్వాతే..


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 14.9 మంది మిలియన్ల ఫాలొవర్లు ఉండగా.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 24.8 మిలియన్ల ఫాలొవర్లు మాత్రమే ఉండేవారు. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోడీ టాప్-2లో ఉన్నారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయం తెలియజేశారు. మొదటి స్థానంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్ట్ నిలిచారు.

నిజమేనా..?

నిజమేనా..?

ప్రధాని మోడీ తాను సోషల్ మీడియా నుంచి తప్పుకోంటున్నట్టు పేర్కొన్న ప్రకటన ట్రోల్ అవుతోంది. అయితే అదీ మోడీ చేశారా.. లేక ఎవరైనా హ్యాక్ చేసి చేశారా అనే సందేహాం కూడా వ్యక్తమవుతోంది. ఇంతకీ ఏం జరిగిందనే అంశంపై ఈ వారంలోపే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

English summary
Prime Minister Narendra Modi, who is often active on social media, on Monday took to Twitter to inform the country about his plan for going offline on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X