తగ్గిన మోడీ ఛాతి! మోడీ 'బెంగాలీ' థ్యాంక్స్,మమత ఫిదా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఛాతి ఆరు అంగుళాలు తగ్గిందట. బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ప్రధాని మోడీ అతిథిగా రానున్న వేళ... ఆయన ధరించాల్సిన పొడవు కోటును తయారు చేసేందుకు కొలతలు ఇవ్వాలని వర్సిటీ అధికారులు ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించారు.

50 అంగుళాల ఛాతీ చుట్టుకొలత, 21 అంగుళాల భుజాల పొడవుతో తయారు చేయాలని సూచించారు. ఆయన కోసం బంగారు రంగులో ప్రత్యేక కోటు ఢిల్లీలో ప్రధానికి దుస్తులు కుట్టించే దర్జీ వద్ద తయారవుతోంది. ఇక గతంలో ఛాతీ కొలతకు, ఇప్పుడు ఛాతీ కొలతకు తేడా వుందా? అని సదరు టైలర్ ను ప్రశ్నిస్తే... సమాధానం ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇది ఓ రాజకీయ అంశమంటూ దీనిపై స్పందించలేనని చెప్పాడు.

కాగా, ప్రధాని మోడీ ఛాతీ చుట్టుకొలత ఆరు అంగుళాలు తగ్గిందా? అసలు ఆయన ఛాతీ చుట్టుకొలత ఎంత?... 2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మరో గుజరాత్ రాష్ట్రాన్ని తయారు చేసే శక్తి మోడీకి లేదని ములాయం వ్యాఖ్యానించారు.

PM Narendra Modi’s chest now said to measure 50 inches

మరో గుజరాత్ తయారు కావాలంటే ఏం ఉండాలో తెలుసా? చప్పన్ ఇంచ్ కీ ఛాతీ (56 అంగుళాల ఛాతీ) అవసరం లేదన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. మోడీకి 56 అంగుళాల బలమైన ఛాతీ ఉందని అందరూ భావించారు. కాంగ్రెస్ పార్టీ ఇదే అంశంపై విమర్శలు కూడా చేసింది.

మాతృభాషలో మమత, మోడీ శుభాకాంక్షలు

కొత్త సంవత్సరం సందర్భంగా ప్రధాని మోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుజరాతీ భాషలో శుభాకాంక్షలు తెలిపితదే, ఆయన ఆమెకు బెంగాలీలో ధన్యవాదాలు తెలిపారు. రాజకీయంగా ఇరు పార్టీల నడుమ సయోధ్య లేకపోయినా ఈ శుభాకాంక్షలు గమనార్హం.

హృదయాన్ని హత్తుకునే రీతిలో మమతా బెనర్జీ తనకు శుభాకాంక్షలు తెలిపారని ప్రధాని మోడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ప్రధానికి తన సందేశం నచ్చడం ఆనందంగా ఉందని ఆయన బెంగాలీలో పంపిన శుభాకాంక్షలకు మమత కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+