కేరళ ప్రజలకు నేను క్షమాపణలు చెబుతున్నాను: మోడీ

తిరువనంతపురం: కేరళ బీజేపీ కార్యకర్తల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. తొలిసారి కేరళ పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం త్రిసూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ‘కేరళ ప్రజలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ఎందుకంటే, ఈ రాష్ట్ర పర్యటనకు ఆలస్యంగా వచ్చినందుకు. ఇటువంటి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను' అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

PM Narendra Modi's first Kerala visit begins

కేరళలో బీజేపీ పార్టీ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారని, ఆయా ఘటనల్లో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. కార్యకర్తల కృషితో కేరళలో బీజేపీకి ఆదరణ పెరిగిందన్నారు. ప్రజలు మన పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ప్రధాని మోడీ భావోద్వేగంగా మాట్లాడారు.

కేరళలో సాధువులు సామాజిక అంటరానితనం లేకుండా చేశారన్నారు. కానీ కేరళలో కొందరి వల్ల రాజకీయ అంటరానితనం ఇంకా పోలేదన్నారు. కేరళ బీజేపీ కార్యకర్తల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, వారికి సహనం ఎక్కువన్నారు.

ప్రకృతి అందాలకే కాక, మానవ వనరులకూ నిలయంగా ఉన్న కేరళ నుంచి లక్షలాది యువత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తమ ప్రతిభ చాటుకుంటున్నదని, ఇటీవల తన యూఏఈ పర్యటనలో అక్కడి భారతీయులతో ముఖ్యంగా కేరళ ప్రజలతో సమావేశమైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక్కడి యువత ఎంతో తెలివిగలవారని, వారి నూతన ఆలోచనా విధానం దేశానికి ఎంతో అవసరమన్నారు. విదేశాల్లో కేరళీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆదేశాధినేతలతో మాట్లాడి పరిష్కరించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.

'మేక్ ఇన్ ఇండియా'ను ఏన్డీఏ ప్రభుత్వం ముందుకు నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదన్నారు. 2022లో భారత్ 75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకోనుందని, ఆలోగా ప్రతి పౌరుడి సొంత ఇంటి కలను సాకారం చేయాలన్నది తన కలని వ్యాఖ్యానించారు.

కేరళ రాష్ట్రంలోని మత్యకారుల అభివృద్ధి కోసం త్వరలో భారీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+