దేవుడిలా కనిస్తున్న మోదీ వన్ మ్యాన్ షో, రాత్రికి రాజ్ భవన్ లో మకాం, స్కెచ్ అంటే !

బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడానికి ఆ పార్టీ నాయకులు అనేక స్కెచ్ లు వేస్తున్నారు. బీజేపీకి దేవుడిలా కనిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, కన్నడ హీరోలు సుదీప్, దర్శన్ తదితరులు బిజీ అయ్యారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వస్తున్నారు.

 modi

శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హుమ్నాబాద్, విజయపుర, కుడచిలో బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చెయ్యడానికి రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గోంటున్నారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు చేరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఐదు కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొంటున్నారు. శనివారం సాయంత్రం 6.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఇప్పటికే మాగడి రోడ్డు, నైస్ రోడ్డు జంక్షన్లను పరిశీలించిన ఎన్ఎస్ జీ అధికారులు బెంగళూరు సిటీ పోలీసులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి మోదీ భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు. మాగడి రోడ్డులో నివాసం ఉంటున్న నివాసాల యజమానులు, అంగడి యజమానులకు నోటీసులు జారీ చేసిన అధికారులు ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే సమాచారం ఇవ్వాలని సూచించారు.

 modi

బెంగళూరులోని మాగడి రోడ్డు, నైస్ రోడ్డు జంక్షన్ ల మీద ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో 45 నిమిషాల పాటు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో సందర్బంగా డీసీపీలు, ఏసీపీలు, డీఎస్సీలతో పాటు 80 మంది ఎస్ఐలతో సహ 3,000 పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉంటారని బెంగళూరు సిటీ అధికారులు తెలిపారు. 5 కిలోమీటర్లు 45 నిమిషాల పాటు మోదీ రోడ్ షోలో పాల్గొంటారు.

ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో పూర్తి అయిన తరువాత ఆయన నేరుగా రాజ్ భవన్ చేరుకుంటారు. రాత్రి రాజ్ భవన్ లో బస చెయ్యనున్న ప్రధాని నరేంద్ర మోదీ మరుసటి రోజు (ఏప్రిల్ 30వ తేదీ) కోలారు. చెన్నపట్టణ, మైసూరు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గోంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+