ఇంకెంత కాలం?: నెహ్రూ-రాహుల్, విపక్షాలపై మోడీ నిప్పులు, బిగ్ హింట్

న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే.. మరోవైపు, కాంగ్రెస్ సహా విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. సోమవారం సాయంత్రం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. విపక్షాలు చాలా కాలం విపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని ఎద్దేవా చేశారు.

దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున మళ్లీ దశాబ్దాల తరబడి విపక్షంలో ఉండాలని భావిస్తున్నారని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తారని భావిస్తున్నా అని అన్నారు. ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని అన్నారు. విపక్షాల తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందారన్నారు. ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కొవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయన్నారు.

 PM Narendra Modi speech in lok sabha: hits out congress and opposition

దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి వివరించారని ప్రధాని మోడీ తెలిపారు. దేశ ప్రగతి నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉందని రాష్ట్రాపతి తెలిపారన్నారు. మహిళలు, యువత, పేదలు, రైతులపై దేశాభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. ఇంకా ఎంత కాలం విభజన రాజకీయాలు చేస్తారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు ప్రధాని మోడీ. మైనార్టీలను వేరుగా ఎందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ ప్రజలంటే మైనార్టీలు ఉంటారు.. దేశ యువత అంటే మైనార్టీ యువత ఉంటారు.. దేశ మహిళలంటే మైనార్టీ మహిళలు కూడా ఉంటారని స్పష్టం చేశారు. తాము మేకిన్ ఇండియా అంటే కాంగ్రెస్ క్యాన్సిల్ అని అందని.. తాము ఆత్మ నిర్భర్ భారత్ అంటే కాంగ్రెస్ వద్దందని.. మండిపడ్డారు.

దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు కేవలం పదేళ్లలోనే 5వ స్థానంలో నిలిచి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటామన్నారు ప్రధాని మోడీ. ఆబ్ కీ బార్ మోడీ సర్కార్ అని.. భారత అభివృద్ధి మోడీ గ్యారంటీ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ దేశం, దేశ ప్రజలపై నమ్మకం లేదని విమర్శించారు ప్రధాని మోడీ. భారత తొలి ప్రధాని నెహ్రూ ఎర్రకోటపైనుంచి మాట్లాడుతూ.. భారత ప్రజలు.. యూరోప్, అమెరికా, జపాన్ ప్రజల్లా కష్టపడి పనిచేయలేరని అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ దేశ ప్రజలపై నమ్మకం లేదని మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలు దేశానికి భారీ నష్టాన్ని కలిగించాన్నారు. ఒకే ప్రొడక్ట్‌ను పదే పదే లాంచ్ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీపై పరోక్షంగా సెటైర్లు వేశారు.

తాము పదేళ్లలో చేసిన అభివృద్ధి.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలంటే వందేళ్లు పట్టేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి కుప్పకూలిందన్నారు. ఆ కూటమిలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తామన్నారు. ఈ విషయాన్ని విపక్ష నేత ఖర్గే కూడా చెప్పారని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. పేదరికం భారీగా తగ్గిపోయిందన్నారు.

బీజేపీకి 370కిపై సీట్లు.. మూడో టర్మ్‌లో అతిపెద్ద నిర్ణయాలు

వచ్చే బీజేపీకి సొంతంగా 370కిపైగా సీట్లు వస్తాయని.. ఎన్డీఏకు 400 సీట్లకుపైగా వస్తాయన్నారు. తమ పాలనలో ఆర్టికల్ 370 రద్దయిందన్నారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించామన్నారు. చంద్రయాన్-3కి అడుగుల వేశామన్నారు. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మితమైందన్నారు. భగవాన్ రాముడు తన సొంత ఇంటికి వచ్చారన్నారు. దేశంలోని 4 కోట్ల మంది ప్రజలకు ఇళ్లు నిర్మించామని తెలిపారు.

మరో వంద రోజుల్లో మూడోసారి తమ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత మరో వెయ్యేళ్లకు సరిపడా అభివృద్ధికి పునాదులు వేస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. మూడో టర్మ్‌లో అతిపెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చామన్నారు. మేడిన్ ఇండియా ఫోన్లు ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలు జరుగుతున్నాయన్నారు.

రైతులకు రూ. 18 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని ప్రధాని తెలిపారు. కిసాన్ సమ్మాన్‌తో రైతులకు తమ ప్రభుత్వం సాయం అందిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ ఓబీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నామన్నారు ప్రధాని మోడీ. మా ప్రభుత్వంలో ఓబీసీలు ఎవరూ లేరని కాంగ్రెస్ అంటోందన్నారు. తన అంత పెద్ద ఓబీసీ నేత కాంగ్రెస్ పార్టీకి నిపించడం లేదా? అనిప్రశ్నించారు ప్రధాని మోడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+