ఆ ఆనవాయితీ తప్పని నరేంద్ర మోడీ: పశ్చిమ సరిహద్దుల వైపు ప్రయాణం: జైసల్మేర్ లేదా భుజ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన దీపావళి ఆనవాయితీని ఈ సారి కూడా కొనసాగించబోతున్నారు. కుటుంబాలకు దూరంగా, ప్రాణాలను పణంగా పెట్టి, దేశ సరిహద్దుల్లో పహారా కాస్తోన్న జవాన్లతో ఆయన దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సారి తన రూటు మార్చారు. పశ్చిమ సరిహద్దులకు తరలి వెళ్లనున్నారు. ఏ ప్రదేశంలో ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొంటారనేది ఇంకా నిర్ధారించలేదు. గుజరాత్ లేదా రాజస్థాన్ బోర్డర్‌కు నరేంద్ర మోడీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్‌లోొని జైసల్మేర్, లేదా తన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని భుజ్‌కు వెళ్తారని అంటున్నారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ తొలి దఫా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది నుంచీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రతి దీపావళి నాడు సరిహద్దులకు తరలి వెళ్తున్నారు. క్లిష్ట వాతావరణంలోనూ ఆయన వెనుకంజ వేయలేదు. జవాన్లకు తన చేతుల మీదుగా స్వీట్ బాక్స్‌లను అందజేస్తున్నారు. దేశం మొత్తం వారి వెంట ఉందనే సందేశాన్ని జవాన్లకు ఇవ్వడానికే తాను వారితో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొంటున్నానని చాలాసార్లు చెప్పుకొచ్చారాయన.

ప్రతి సంవత్సరం వేర్వేరు సరిహద్దు ప్రాంతాలను ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కీలక ప్రదేశాలకు వెళ్లొచ్చారు. ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తొలి ఏడాదే ఆయన సియాచిన్‌ను సందర్శించారు. 2015లో పంజాబ్ సరిహద్దుల్లో దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. ఆ మరుసటి ఏడాది హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. ఐటీబీపీ జవాన్లను కలిశారు. 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లో భారత్-చైనా సరిహద్దు జవాన్లతో దీవాళీ పండుగ వేడుకలను పంచుకున్నారు. గత ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌ను సందర్శించారు. ఈ సారి పశ్చిమ సరిహద్దుల వైపు వెళ్లనున్నారు.
Recommended Video
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications