పట్టపగ్గాల్లేని ఆనందంలో ప్రధాని- దీపజ్యోతి
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పశుపక్ష్యాదులు అంటే ఎంతో ప్రేమ. ఎంతో ఇష్టంగా వాటిని పెంచుకుంటుంటారు. వాటి పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. దేశ రాజధానిలో గల ఆయన అధికారిక నివాసంలో పలు నెమళ్లు, ఆవులు.. సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఆయన ఇళ్లు.. ఓ ఉద్యానవనాన్ని తలపిస్తుంటుంది.
తాజాగా ఆయన కుటుంబంలో మరో కొత్త మెంబర్ వచ్చి చేరింది. పేరు దీపజ్యోతి. ఓ దూడ. మోదీ పెంచుకుంటోన్న ఓ ఆవు.. ఇటీవలే దూడకు జన్మనిచ్చింది. దానికి దీపజ్యోతి అని స్వయంగా పేరు పెట్టారాయన. ఆయనకు ఎంతో ఇష్టమైన పేరు ఇది. దీపం వెలిగించే సమయంలో పలికే శ్లోకం నుంచి ఈ పేరును తీసుకున్నారు.

తాజాగా ఈ దూడకు సంబంధించిన ఓ మినీ వీడియో క్లిప్‌ను ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆవు సర్వసుఖప్రదం అనే సంస్కృత పదాలను దానికి జత చేశారు. ఎంతో ఆప్యాయంగా దూడను నిమురుతూ, ముద్దాడుతూ కనిపించారు. ఆనందంతో పొంగిపోతున్నట్లు చెప్పుకొచ్చారు.
అమ్మవారికి పూజ చేసే సమయంలో దాని మెడలో పూలదండను వేశారు. శాలువ కప్పారు. తెల్లరంగుతో ఓ నామం ఉండటం ఈ లేగదూడకు ప్రత్యేక ఆకర్షణ. తన చేతులతో ఎత్తుకుని ఎంతో మురిపెంగా ఇంట్లో కలియతిరిగారు మోదీ. ఇంటి బయట తోటలో మురిసిపోతూ దానితో ఆడుకున్నారు.
हमारे शास्त्रों में कहा गया है - गाव: सर्वसुख प्रदा:'।
— Narendra Modi (@narendramodi) September 14, 2024
लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है।
प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है।
इसलिए, मैंने इसका नाम 'दीपज्योति'… pic.twitter.com/NhAJ4DDq8K
దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా నిత్యం తీరిక లేకుండా గడిపే ప్రధాని మోదీ.. ఖాళీ సమయంలో మూగ జీవాలు, పక్షులతో సేదదీరుతుంటారని మరోసారి రుజువైంది.
ప్రస్తుతం మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది బీజేపీ. తొలి విడతలో జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీని తరువాత మహారాష్ట్ర, జార్ఖండ్‌లల్లో ఈ ఎన్నికలు షెడ్యూల్ కావాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దోడా జిల్లాకు బయలుదేరి వెళ్లడానికి ముందు ఈ వీడియోను పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications