కన్నడిగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు, కన్నడలో ట్వీట్, ఎందరో మహానుభావులు!

న్యూఢిల్లీ: కన్నడ రాజ్యోత్సవం (కర్ణాటక రాజ్యోత్సవం) సందర్బంగా కన్నడిగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక సంసృతి, చరిత్ర ఎంతో గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంశించారు. అనేక రంగాల్లో కన్నడిగులు తమ ప్రతిభనుచాటి చెప్పారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.

కర్ణాటక రాజ్యోత్సవం సందర్బంగా కన్నడ సోదరసోదరీమణులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభనుచాటి చెప్పిన మహానుభావులు జన్మించిన గడ్డ కర్ణాటక అని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.

PM Narendra Modi wished people of Karnataka on the occasion of Karnataka Rajyotsava

కన్నడ రాజ్యోతవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ కన్నడ బాషలోనే శుభాకాంక్షలు చెప్పడంతో కన్నడిగులు సంతోషం వ్యక్తం చేశారు. కన్నడతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఇంగ్లీష్ లో కన్నడ రాజోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు కన్నడిగులకు కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీకి పలు రాష్ట్రాల ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్ లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేసి ఆ బాషకు ప్రాధాన్యత ఇచ్చినట్లే వేరే బాషల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానికి సూచించారు. దక్షిణ భారత బాషల పట్ల కేంద్రంలోని కొందరు పెద్దలు చిన్నచూపు చూస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+