మోడీని కలిసిన అమితాబ్, గడ్కరీకి రూ.10వేల జరిమానా
ఢిల్లీ: వ్యక్తిగత కార్యక్రమాల నిమిత్తం దేశ రాజధాని న్యూఢిల్లీ వచ్చిన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బిగ్ బి మోడీని కలుసుకున్న విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది.

ఈ మేరకు ఫొటోలను కూడా ఉంచింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఆ రాష్ట్రానికి అమితాబ్ బచ్చన్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

కోర్టు ఖర్చులకి10 వేలు చెల్లించండి: గడ్కరీకి కోర్టు
ఓ పరువునష్టం కేసులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పదివేల రూపాయల జరిమానా విధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించిన కేసులో గడ్కారీ తమ తీర్పునకు కట్టుబడలేదన్న కోర్టు జరిమానా విధించింది.
న్యాయస్థానం ఆదేశాలు మేరకు గడ్కరీ ప్రమాణపత్రం అందజేయలేదు. దీంతో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోమతి మనోఛ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 18లోపు అఫిడవిట్ దాఖలు చేయాలన్న ఆదేశాలను గడ్కరీ పట్టించుకోకపోవడంతో పదివేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.
కేసు తదుపరి విచారణను 2015 మార్చి 21కు వాయిదా వేశారు. గడ్కరీ తరపున సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ కోర్టుకు హాజరై కేజ్రీవాల్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు ఈ నెల 18నే అఫిడవిట్ ఇచ్చామని చెప్పారు. అయితే తమకు శనివారం అందించాలని కేజ్రీవాల్ తరపున్యాయవాది రిషికేష్ న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.
కోర్టు గుమస్తాకు కూడా 10నే అఫిడవిట్ అందించామని పింకీ చెప్పగా తమకు తెలియకుండా అదేలా సాధ్యమని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయస్థానం ఆదేశానుసారం వ్యవహరించాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications