PM SVANidhi Scheme : కొత్త వ్యాపారానికి లోన్ కావాలా?. పీఎం స్వనిధి మీ కోసమే
కొత్త ఏడాది ప్రారంభమైంది. ఈ ఏడాదిలో చిన్న వ్యాపారాన్నైనా ప్రారంభించాలనుకుంటున్నారా?. చేతిలో రూపాయి లేకపోయినా పర్లేదు. కేంద్రం మీకోసం ఒక మంచి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంతో ఇంటి వద్దనే, లేదా సొంత ఊర్లోనే ఉండి నెలకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు సంపాదించవచ్చు. ఈ పథకం గురించి పూర్తి వివరాల ఇక్కడ తెలుసుకోండి.
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (PM SVANidhi) పథకం దేశంలోని చిన్న-చిన్న వీధి వ్యాపారులను ఆర్థికంగా తోడ్పాటునిచ్చేందుకు రూపొందించిన ఒక కీలక స్కీమ్. ఈ పథకాన్ని కేంద్రం జూన్ 2020 కరోనా మహమ్మారి విలయతాండవం తర్వాత.. తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టింది. అప్పటి నుండి ఇది వేలాది వీధి వ్యాపారుల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చింది.
పథకం ముఖ్య లక్ష్యాలు
పీఎం స్వనిధి పథకం ముఖ్యంగా వీధి వ్యాపారులకు కాంట్రాక్ట్ లేకుండా రుణాలు ఇవ్వడం ద్వారా.. వారికి ఆర్ధిక తోడ్పాటును ఇవ్వడంతో పాటు వ్యాపారానికి కేంద్రం అండంగా ఉందనే భరోసాను ఇస్తుంది. అంతే కాకుండా జిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది.

ఎవరెవరు అర్హులు
పీఎం స్వనిధి కోసం మీకు అర్హత ఉండటానికి.. మీరు వీధి వ్యాపారిగా ఉన్నట్లు ధృవీకరణ పత్రం కావాలి. పట్టణ ప్రాంతాలలో మీ వ్యాపారం కొనసాగుతున్నట్లయితే Certificate of Vending తో పాటు ఆధార్ కార్ట్ కలిగి ఉండాలి. లేదా ULB/TVC ద్వారా Letter of Recommendation (LoR) లభిస్తే మీరు స్కీంలో భాగమవుతారు. ULB సర్వేతో గుర్తింపు పొందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది
ఎలా అప్లై చేయాలి?
పీఎం స్వనిధికి అప్లై చేయాలి అనుకునే వారు అధికారిక PM SVANidhi పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. అనంతరం అవసరమైన డాక్యూమెంట్లను అప్‌లోడ్ చేయాలి. మీ అప్లికేషన్ సమర్పించిన తర్వాత బ్యాంక్ ద్వారా పరిశీలన జరుగుతుంది. అనంతరం లోన్ డబ్బులు మీ ఖాతాలో పడతాయి. సీఎస్ఐ సెంటర్స్ ద్వారా ఆఫ్లైన్‌గా సహాయం అందుబాటులో ఉంటుంది.
లోన్ ఎంత ఇస్తారు..?
పీఎం స్వనిధికి అర్హులుగా నిర్ధారణైన తర్వాత రుణాలు మూడు దశలుగా ఇవ్వబడతాయి. మొదటి దశలో రూ. 15,000 వరకు రుణం ఇస్తారు. ఇది ఇన్ టైంలో బ్యాంక్ కు కడితే.. రెండవ దశలో రూ. 25,000 వరకు రుణం ఇస్తారు. ఇక మూడో దశలో రూ. 50,000 వరకు రుణం దక్కుతుంది.












Click it and Unblock the Notifications