పిఎంపై నిన్న బారు, నేడు పరేఖ్: కౌంటర్‌కు కాంగ్రెస్ రెడీ

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ పైన నిన్న సంజయ బారు... నేడు పిసి పరేఖ్ వెల్లడిస్తున్న పుస్తకాలతో కాంగ్రెసు పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ రాసిన క్రూసేడర్ ఆర్ కాన్సిపేరేటర్? కోల్‌గేట్ అండ్ అదర్ ట్రూత్స్ అనే పుస్తకం పిడుగులా పడనుంది.

పరేఖ్ రాసిన ఈ పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. బొగ్గు శాఖ కార్యదర్శిగా పరేఖ్ ఉన్పప్పుడే కోల్‌గేట్ కుంభకోణం సంచలనం సృష్టించింది. పిసి పరేఖ్ తన పుస్తకంలో మన్మోహన్ సింగ్‌కురోజు అవమానాలేనని ప్రస్తావించారు. స్వల్పమైన రాజకీయాధికారం ఉన్న ప్రభుత్వానికి ఆయన సారథిగా ఉన్నారని చెప్పారు. ఇటీవలే మాజీ మీడియా సలహాదారు సంజయ బారు ప్రధాని పైన సంచలన పుస్తకం విడుదల చేశారు. పైళ్లను సోనియాకు పంపే వారని అందులో పేర్కొన్నారు.

PM was unable to counter vested interests: Parakh says in memoir

కాగా, ప్రధానమంత్రి కార్యాలయం ఫైళ్లను సోనియా చూస్తారన్న విమర్శలో పసలేదని పిఎంవొ ప్రతినిధి పంకజ్ పచౌరీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ పత్రికా సలహాదారు సంజయ్ బారు రాసిన 'యాక్సిడెంటల్ ప్రధాన మంత్రి..' పుస్తకంలోని అంశాలపై విరుచుకుపడ్డారు.

సోనియా చెప్పుచేతల్లో మనిషిగా ప్రధానిని చిత్రించాలనుకోవడం వ్యర్థ ప్రయాస అని, అది ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లేని తుంటరి, అభూత కల్పన అంటూ మండిపడ్డారు. తన ఉన్నత హోదాను బారు దుర్వినియోగం చేశారని, మెప్పు పొందడం కోసం అత్యున్నత స్థానాన్ని వాడుకున్నారని, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారం ఉపయోగించుకున్నారని దుయ్యబట్టారు.

అత్యున్నత నిర్ణయాలు తీసుకునే ముందు పిఎంవొ ముఖ్య కార్యదర్శి పులోక్ ఛటర్జీ సోనియాను కలిసి ఆమోదం పొందేవారన్న బారు వ్యాఖ్యలను తప్పుబట్టారు. మరోవైపు పిఎంవో వాదనను బిజెపి తోసిపుచ్చింది. మన్మోహన్ అత్యంత బలహీన ప్రధాని అన్నది ప్రపంచం మొత్తానికీ తెలుసునని, ప్రభుత్వంలో సోనియా మాటే చెల్లుబాటవుతుందన్నదీ స్పష్టమేనని, ఈ అంశాలనే సంజయ్ బారు తన పుస్తకంలో ద్రువీకరించారని ఆడ్వానీ అన్నారు.

ప్రతిష్ట పెంచే యోచనలో కాంగ్రెస్

మన్మోహన్ సింగ్ బలహీన ప్రధాని అని సంజయ బారు, పిసి పరేఖ్‌లు పుస్తకంలో ప్రస్తావించిన నేపథ్యంలో ఆయనకు ప్రతిష్టను పెంచే యోచనలో కాంగ్రెసు పార్టీ పడింది. ఎన్నికల నేపథ్యంలో ఆయన ర్యాలీల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారట. కాగా, మళ్లీ ఉద్యోగం ఇవ్వనందునే సంజయ బారు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెసు పార్టీ మండిపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+