'బుక్ మైషో' లో ప్రధాని మోదీ ఈవెంట్ బ్లాక్ బస్టర్.. 30 నిమిషాల్లోనే సీట్లన్నీ ఫుల్
ప్రధాని నరేంద్ర మోదీ సభలకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. మోదీ మీటింగ్ అంటే వేలాది మంది కార్యకర్తలు తరలివస్తుంటారు. అదే మోదీ హోమ్ స్టేట్ గుజరాత్ లో సభ అంటే లక్షలాది మందితో అక్కడ పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రధాని మోదీ సెప్టెంబర్ 8 మంగళవారం నాడు గుజరాత్ లోని వడోదరలో పర్యటించనున్నారు.
రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ఇక్కడ జరిగే భారీ బహిరంగ సభకు తొలిసారి బుక్ మైషో లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 30 నిమిషాల్లోనే బుక్ అయిపోవడం విశేషం. అంతేకాక దాదాపు 42 వేల మందికి పైగా దరఖాస్తుదారులు వెయిటింగ్ లిస్ట్ లో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో నిర్వాహకులు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ కోసం వడోదర మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా బుక్ మైషో ద్వారా రిజిస్ట్రేషన్లను నిర్వహించింది. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించడంతో ప్రధాని మోదీ సభకు భారీగా స్పందన వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన గంటలోనే అందుబాటులో ఉంచిన సీట్లన్నీ బుకింగ్ అయిపోయాయి.
దాంతో రిజిస్ట్రేషన్ ను మూసివేశారు అధికారులు. ఇక సభా ప్రాంగణం వద్ద ఎలాంటి తొక్కిసలాట జరగకుండా సభ సాఫీగా సాగేందుకు పూర్తిగా డిజిటల్, సాంకేతిక ఆధారిత ఎంట్రీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాంతో రిజిస్టర్ చేసుకున్న వేదిక వద్దకు ప్రజల రాకపోకలు వేగవంతంగా, ఎటువంటి తొక్కిసలాట జరగకుండా సాఫీగా సాగేందుకు పూర్తిగా డిజిటల్, సాంకేతిక ఆధారిత ఎంట్రీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రిజిస్టర్ చేసుకున్న వారికి బుక్ మైషో యాప్ లో లైవ్ QR కోడ్ తో కూడిన డిజిటల్ M-Ticket అందుతుంది.

ఇక వడోదర పర్యటనలో భాగంగా నగరంలో రూ. 35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రూ.20,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని 326 కిలోమీటర్ల మేర మూడు కీలక విభాగాలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అలాగే తాండా రోడ్- వడోదర మధ్య న్యూ ప్యాసింజర్ రైలు, ఛోటా ఉదేపూర్-ధార్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జోబత్-తాండా రోడ్ న్యూ రైల్వే లైన్ ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.












Click it and Unblock the Notifications
