బాల సుబ్రమణ్యం ఆరోగ్యంపై పీఎంవో ఆరా, పళనిస్వామి, వెంకయ్య కూడా, వారంలో క్యూర్..
కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసిందిం. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పీఎంవో అధికారులు ఆస్పత్రి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకిన బాలు.. చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన క్షేమంగా కోరుకోవాలని అభిమాన లోకం కోరుకుంటుంది. ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి మార్చడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం నిలకడగానే ఉంది అని వైద్యులు తెలిపారు. ప్లాస్మా థెరసీ నిర్వహించాలని భావిస్తున్నారు.
Recommended Video
పీఎంవో అధికారులు ఆస్పత్రి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుకి అందిస్తోన్న వైద్యం, స్పందిస్తోన్న తీరు గురించి సీఎం పళని స్వామి కూడా తెలుసుకుంటున్నారు. ప్రధాని మోడీకి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి.. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. గాన గంధర్వుడి ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు/ పూజలు చేస్తున్నారు.

బాలు ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం సులభంగా శ్వాస తీసుకుంటున్నారని వెల్లడించారు. మరో వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. మరోవైపు బాలు భార్య కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగుందని.. మూడు రోజుల్లో వైరస్ నుంచి కోలుకుంటారని చరణ్ తెలిపారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications