20రూపాయలు కట్టి రెండు లక్షల ఆర్ధిక భరోసా పొందేలా వారికి కేంద్రం వరం!
దేశంలోని నిరుపేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఈ పథకాల ద్వారా పేదలకు ఆర్థిక భరోసాను, ఉపాధి హామీని కల్పిస్తుంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని వారికి వందరోజుల పని కల్పిస్తోంది. ఇదే క్రమంలో ఉపాధిహామీ పథకంలో జాబ్ కార్డులు ఉన్న ప్రతీ కూలికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని అమలు చేస్తోంది.
కేంద్రం ఇచ్చే గొప్ప పథకం.. ప్రీమియం 20 రూపాయలు
ఈ పథకం కింద 18 సంవత్సరాల వయసు నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యవసాయ కూలీలు, పోస్ట్ ఆఫీస్ లలో, బ్యాంకులలో ఖాతాలు ఉన్న వారు సంబంధిత కార్యాలయాలను సంప్రదించి పీఎంఎస్బివై లో నమోదు చేసుకోవాలి. ఇందులో నమోదు చేసుకునేందుకు రాతపూర్వక దరఖాస్తుతోపాటు 20 రూపాయల ప్రీమియం చెల్లించి బీమా పొందాలి.

ఉపాధి హామీ కూలీలకు పథకం వర్తింపు
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో లబ్ధిదారులు ఉపాధి పనుల ప్రదేశంలో దురదృష్టవశాత్తు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం పొందితే వారికి కేంద్రం రెండు లక్షల రూపాయల బీమా అందిస్తుంది. పాక్షిక వైకల్యం సంభవిస్తే లక్ష రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. చాలామంది ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ఈ బీమా పథకం పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల వారు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు.
జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు బీమా వర్తింపు
ఈ పథకానికి సంబంధించి ప్రీమియం 12 రూపాయలుగా ఉండేది కానీ ప్రస్తుతం 20 రూపాయలకు పెరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం యొక్క కవరేజ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం లబ్ధిదారుడి యొక్క సంబంధిత బ్యాంకు ఖాతా నుండి 20 రూపాయల ప్రీమియం ఆటో డెబిట్ అవుతుంది.
బీమా సొమ్ము ఇలాగే ఇచ్చేది
ప్రతి సంవత్సరం మే 31 నాటికి సేవింగ్స్ ఖాతాలో డబ్బులు ఉండేలా చూసుకోవాలి. మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు బీమా అందజేస్తారు. రెండు కళ్ళు పూర్తిగా పోయినా లేదా రెండు చేతులు లేదా రెండు కాళ్లు ఉపయోగించుకోలేకపోతున్నా కూడా 2 లక్షల రూపాయల బీమా అందిస్తారు. ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటిచూపు కోల్పోవడాన్ని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు. దీనికి లక్ష రూపాయల బీమాను అందిస్తారు. ఉపాధి హామీ పనులు చేసే నిరుపేదలు తక్షణం ఈ పథకాన్ని పొందాలంటే పోస్టాఫీస్ , బ్యాంకులను సంప్రదించండి












Click it and Unblock the Notifications