పిఎన్బీ స్కామ్: ఉన్నతాధికారుల విచారణ, ముంబై బ్రాంచ్‌కు తాళం

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బీ) కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) నీరవ్ మోడీకి చెందిన ఉన్నతాధికారులను విచారించడం ప్రారంభించింది. నీరవ్ మోడీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు సోమవారం సమన్లు జారీ చేసింది.

ముంబైలో నీరవ్ మోడీ సిఎఫ్ఓ రవి గుప్తాను ఇంటరాగేషన్ నిమిత్తం సిబిఐ పిలిచింది. నీరవ్ మోడీకి చెందిన ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన విపుల్ అంబానీని కూడా విచారణ నిమిత్తం పిలిచింది.

PNB scam: CBI to probe Nirav Modi's top official, seals Mumbai branch

నకిలీ అవగాహన లేఖలను (ఎల్ఓయులను) జారీ చేసిన వ్యవహారంలో సిబిఐ అధికారులు ఇప్పటికే 11 మంది అధికారులను విచారించారు. బ్యాంక్ మాజీ ఉద్యోగులు నీరవ్ మోడీ, అతని మేనమామ చోక్సీలకు ఆ ఎల్ఓయులు జారీ చేశారు.

ఇదిలావుంటే, కుంభకోణం జరిగిన ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాడీ హౌస్ శాఖను సిబిఐ అధికారులు సీల్ చేశారు. ఇదే విదమైన అక్రమాలు జరిగినట్లు తేలితే తమకు సమాజారం అందించాలని సిబిఐ ఇతర భారతీయ బ్యాంకులకు లేఖలు రాింది.

కుంభకోణానికి సంబంధించి సిబిై శనివారంనాడు పిఎన్‌బీ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టిని, సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్ ఖరత్‌ను, హేమానంద్ భట్‌ను అరెస్టు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+