పీఎన్బీ స్కాం: 9ఖరీదైన మోడీ కార్లు సీజ్, వాటిలో రోల్స్ రాయిస్, బెంజ్..!
Recommended Video

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో 11వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నగల వ్యాపారవేత్త నీరవ్ మోడీ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు చూపుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నీరవ్ మోడీ ఆస్తులను సీజ్ చేస్తున్న ఈడీ.. తాజాగా మరిన్ని ఆస్తులను సీజ్ చేసింది.
పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులైన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ గ్రూప్స్‌కు సంబంధించిన రూ.94కోట్ల విలువైన షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ను గురువారం ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్(ఈడీ) సీజ్ చేసింది.

9విలాసవంతమైన కార్లు సీజ్
వీటితోపాటు నీరవ్ మోడీకి చెందిన 9 విలాసవంతమైన కార్లను కూడా స్వాధీనం చేసుకుంది. వీటిలో ఒక రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ మోడీల్స్ జీఎల్ 350సీడీఐ, పోర్చె పనమెర, మూడు హోండా కార్లు, ఒక టాయోటా ఫార్చూనర్, టాయోటా ఇన్నోవాలు ఉన్నాయి.

షేర్లు, మ్యూచువల్ ఫండ్లు కూడా
నీరవ్ మోడీకి చెందిన రూ. 7.80కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, మెహుల్ చోక్సీ గ్రూప్‌కి సంబంధించిన రూ.86.67కోట్ల మ్యూచువల్ ఫండ్స్, షేర్లు ఈడీ స్వాధీనం చేసుకుంది.

ముమ్మర దాడులు
కాగా, బుధవారం ముంబైలోని నాలుగు షెల్ కంపెనీలతోపాటు దేశంలోని 17 ప్రాంతాల్లో ఈడీ ముమ్మర దాడులు నిర్వహించింది. బుధవారం రూ.10కోట్ల వరకు ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక పన్నుల శాఖ కూడా నీరవ్ మోడీకి చెందిన 141 బ్యాంకు ఖాతాల్లోని రూ.145.74కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను అటాచ్ చేసింది.

దేశానికి రప్పించే యత్నం
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 11, 380కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోడీ, తన కుటుంబసభ్యులతో కలిసి దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. నీరవ్ మోడీతోపాటు మరో నిందితుడు చోక్సీ పాస్ పోర్టులను ఈడీ సూచన మేరకు విదేశాంగా శాఖ నాలుగు వారాలపాటు రద్దు చేసింది. తిరిగి భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications