పీఎన్బీ స్కాం: నీరవ్ మోడీ సన్నిహితుడి అరెస్ట్, ఈడీ కస్టడీలోకి
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం(పీఎన్బీ స్కాం) కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి అత్యంత సన్నిహితుడు, ఫైర్‌స్టార్ డైమండ్స్ సంస్థల ఉపాధ్యక్షుడు శ్యామ్‌సుందర్ వాద్వాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది.

ఈ కేసులో ఈడీకి ఇది తొలి అరెస్టు కాగా.. వాద్వాను ముంబై స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే పీఎన్‌బీ కేసులో నీరవ్ మోడీ, గీతాంజలి జెమ్స్ అధినేత చోక్సీపై మనీలాండరింగ్ కేసులు నమోదు చేసిన ఈడీ విస్తృత సోదాలు జరిపి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది.












Click it and Unblock the Notifications