పీవోకేలో తిరుగుబాటు జ్వాలలు: పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్ర ప్రకటన!

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌(POK)లో నేడు పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉంది. పీవోకే రాజధానిగా చెప్పబడుతున్న ముజఫరాబాద్ వైపు నిరసనకారులు నేడు ర్యాలీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో వారు పాకిస్థాన్ అసెంబ్లీ నంచి స్వాతంత్ర్యం ప్రకటించుకునే అవకాశం ఉంది. పీవోకేలోని రావల్కోట్‌లో నిరసన జరుగుతున్న వీడియోలలో వేలాది మంది ప్రజలు కనిపించారు. ఈ ప్రదర్శనలో వందలాది మంది చిన్నారులు కూడా పాల్గొంటున్నారు. వోకేలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి యూనిఫాంలో రావల్కోట్‌లోని ఈద్గా మైదానంలో గుమిగూడారు. వారు తెల్ల జెండాలను ఊపుతూ.. పీవోకేలో పాకిస్థాన్ సైన్యం క్రూరమైన చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. పిల్లలకు ఏమైనా జరిగితే ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) బాధ్యత వహించాల్సి ఉంటుందని పాకిస్థాన్ అధికారులు ఆదివారం హెచ్చరించారు.

కశ్మీర్ అంశంపై ప్రపంచానికి పాకిస్థాన్ విజ్ఞప్తి: భారత్‌పై తీవ్ర ఆరోపణలు!
కశ్మీర్ అంశంపై ప్రపంచానికి పాకిస్థాన్ విజ్ఞప్తి: భారత్‌పై తీవ్ర ఆరోపణలు!

పాకిస్థాన్ అసెంబ్లీ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకుంటుందా?
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) నేడు ముజఫరాబాద్‌కు పాదయాత్రను ప్రకటించింది. అందుకే ర్యాలీలో వేలాది మంది ప్రజలు కనిపిస్తున్నారు. నిరసనకారులు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ముజఫరాబాద్ వైపు పాదయాత్ర ప్రారంభించారు. 3 రోజుల క్రితం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాకిస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పాకిస్థాన్ అసెంబ్లీ నుంచి స్వాతంత్ర్యం కోరతామని పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ డిమాండ్లను అంగీకరించలేదు కాబట్టి జేఏఏసీ పాకిస్థాన్ అసెంబ్లీ నుంచి స్వాతంత్ర్యం ప్రకటిస్తుందా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

POK JAAC Protest Protesters March to Muzaffarabad for Indenpendence Pakistan Full Details

ఈ లోగా యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ(యూకేపీఎన్పీ) ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలు, నిర్బంధాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాశ్మీరీ సమాజ నాయకులు, పాత్రికేయులు, అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, బలప్రయోగాన్ని ఆపాలని డిమాండ్ చేసింది. క్రూరమైన బలప్రయోగం, ఏకపక్ష అరెస్టులు, బలవంతపు అదృశ్యాలను పాకిస్థాన్ అధికారులు తక్షణమే నిలిపివేయాలని యూకేపీఎన్పీ డిమాండ్ చేసింది. నిర్బంధంలో ఉన్న వ్యక్తులందరినీ విడుదల చేసి వారిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరింది. అంతే కాకుండా జూన్ 5వ తేదీ తర్వాత హత్యకు గురైన వారి మృతదేహాలను బేషరతుగా తిరిగి అప్పగించేలా చూడాలని కోరింది.

పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ కు న్యూ టాస్క్- ఇకపై: తెరవెనుక అధికార కేంద్రం
పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ కు న్యూ టాస్క్- ఇకపై: తెరవెనుక అధికార కేంద్రం

పీవోకేలో సంపూర్ణ యుద్ధ ప్రకటన
నిరసన నాయకులకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. దీని తరువాత నిరసన సంస్థల నాయకులు 'చర్చలకు సమయం ముగిసింది.. ఇకపై ప్రతిఘటన మాత్రమే ఉంటుంది' అని ప్రకటించారు. నిరసనకారులు ప్రభుత్వంతో అన్ని చర్చలను విడనాడి, ముజఫరాబాద్ అసెంబ్లీ వైపు కవాతు చేయాలని నిర్ణయించుకున్నారు.

భద్రతా దళాలు, రేంజర్ల భారీ మోహరింపు
నిరసనకారులు ముజఫరాబాద్‌కు చేరుకోకుండా నిరోధించడానికి, పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతం మొత్తాన్ని పటిష్టం చేసింది. ముజఫరాబాద్‌ ప్రవేశ ద్వారం వద్ద 17,500 మందికి పైగా అదనపు భద్రతా సిబ్బందిని, పారామిలిటరీ దళాలను (పాకిస్తాన్ రేంజర్స్) మోహరించారు. ముజఫరాబాద్‌ను కలిపే అన్ని ప్రధాన రహదారులు, రోడ్లను భారీ బారికేడ్లు, ముళ్ల తీగలు, కంటైనర్లతో మూసివేశారు.

పాదయాత్రకు ముందు హింసాత్మక ఘర్షణలు, మరణాలు
నేడు జులై 15న జరగాల్సిన పాదయాత్రకు ముందు పూంచ్, రావల్కోట్, సుధనోటి జిల్లాల్లో విస్తృత హింస చెలరేగింది. రావల్కోట్ బస్ స్టాండ్, సుధనోటి వద్ద నిరసనకారులను చెదరగొట్టడానికి పాకిస్తానీ రేంజర్లు బాష్పవాయువు ప్రయోగించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 నుంచి 9 మంది నిరసనకారులు మరణించినట్లు సమాచారం. దీని తరువాత ర్యాలీకి మరింత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం ప్రారంభించారు.

మొబైల్ ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు నిలిపివేత
నిరసనకారులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నిరోధించడానికి, పాకిస్తాన్ ప్రభుత్వం ముజఫరాబాద్, దాని పరిసర ప్రాంతాలకు వెళ్లే రహదారులలో మొబైల్ ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. అయినప్పటికీ అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలు ప్రధాన రహదారులపై ధర్నాలు చేపట్టి, పాకిస్తాన్ ప్రధాన భూభాగానికి అనుసంధానించే అన్ని మార్గాలను దిగ్బంధించారు. మార్కెట్లు, రవాణా పూర్తిగా స్తంభించిపోయాయి. రికార్డు స్థాయిలో స్థానిక మహిళలు, పాఠశాల విద్యార్థులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలలో, మహిళలు, పిల్లలు ప్లకార్డులు పట్టుకుని, పాకిస్థాన్ సైన్యం అకృత్యాలు, అధిక పన్నులు, పిండి, విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముజఫరాబాద్ వైపు కవాతు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+