వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగ ఫ్రెండ్ షిప్ : తప్పించుకున్నారు.. చిత్రంగా మళ్లీ పట్టుబడ్డారు..

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు : చేసిన తప్పుల్లోంచి తప్పించుకోవడానికి తప్పులు మీద తప్పులు చేస్తూ అడ్డంగా బుక్ అయింది ఓ స్నేహితుల గ్యాంగ్. తొలుత ఓ కేసులో జైలుకు వెళ్లిన గ్యాంగ్ లో నుంచి.. తప్పించుకున్న నిందితులు మిగిలిన స్నేహితులను జైలు నుంచి విడిపించేందుకు మరో తప్పు చేసి కటకటాల పాలయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఒక హత్య కేసులో ఇరుక్కున్న స్నేహితుల గ్యాంగ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు. కాగా.. ఇందులో నుంచి ఆరుగురు నిందితులు పరారయ్యారు. అంతేకాదు, తప్పించుకున్న ఆ ఆరుగురు జైలు లోపల ఉన్న మిగతావారిని ఎలా బయటకు తీసుకురావాలా... అని ఆలోచించి బెయిల్ పై విడిపించేందుకు ఓ ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం ఓ బ్యాంక్ కు కన్నం వేయబోయిన నిందితులు అడ్డంగా పోలీసుల చేతిలో బుక్ అయ్యారు. బ్యాంక్ పరిసరాల్లో అనుమానుస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకుని ఆరా తీయడం మొదలుపెట్టారు.

police again catched a accused friends gang

దీంతో అసలు విషయం బయటపడింది. వాళ్ల దగ్గరున్న ఆయుధాలను సొంతం చేసుకున్న పోలీసులు, స్నేహితులు శిక్ష అనుభవిస్తున్న జైలుకే ఈ గ్యాంగ్ ను కూడా పంపించారు. మొత్తానికి అటు తిరిగి, ఇటు తిరిగి తమ స్నేహితుల దగ్గరికే చేరుకున్నారు మిగతా గ్యాంగ్. అంతా కలిసి ఇప్పుడు జైళ్లో ఊచలు లెక్కబెడుతున్నారు.

English summary
In the bangalore city its an interesting incident happened on friday. after escaping from jail those are tried to help their friends to come out of jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X