రాజకీయ నేతలతో కుమ్మక్కైతే ఇబ్బందులే.. పోలీసు వ్యవస్థపై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు !
ప్రజల విశ్వసాన్ని పొందడంలో జాతీయ సంస్థల కంటే పోలీసు వ్యవస్థ చాలా వెనుకబడి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ వ్యాఖ్యానించారు. నిరాశ, నిస్పృహలతో పోలీసులను ఆశ్రయించేందుకు జనం వెనుకాడుతున్నారని పేర్కొన్నారు. అవినీతి, మితిమీరిన చర్యలు, నిష్ఫాక్షితంగా లేకపోవడం, రాజకీయ వర్గాలతో సన్నిహిత సంబంధాలు కారణంగా పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మసకబారుతోందన్నారు. పాలన మారిన తర్వాత తరచూ పోలీసు అధికారులు వేధింపులకు గురవుతున్నట్లు ఫిర్యాదు వస్తున్నాయని గుర్తు చేశారు.

రాజకీయ నాయకులతో కుమ్మక్కైతే ఇబ్బందులే..
పోలీసులు నైతికత, సమగ్రతకు కట్టుబడి ఉండాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డి.పి. కోహ్లీ 19వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం-దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలుపై జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. రాజకీయ నాయకులతో కుమ్మక్కైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు సామాజిక చట్టబద్ధత, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలని సూచించారు.
దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ ..
ప్రచారాలకు దూరంగా ఉంటూ సీబీఐ తన పని తాను చేసుకుపోతోందని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ఆదునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకే కేసును అనేక సంస్థలు దర్యాప్తు చేసే విధానానికి స్వస్తి పలకాలన్నారు. సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐవో లాంటి సంస్థలు ఒకే గొడుకు కిందకు రావాలని సూచించారు. ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ ఉండాలని సీజేఐనొక్కి చెప్పారు. ప్రతి సంవత్సరం దర్యాప్తు సంస్థల పనితీరుపై మదించాలన్నారు. ప్రాసిక్యూషన్, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి స్థానం లేదు..
రాజకీయ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ దర్యాప్తు సంస్థలే శాశ్వతం అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. పోలీసులు-ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడాలని సూచించారు. స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరిగితే.. పాలకులను గద్దె దించేందుకు ప్రజలు వెనుకాడరని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి స్థానం లేదని స్పష్టం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయడంతో పాటు సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని సీజేఐ పేర్కొన్నారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications