చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రహస్యంగా పెళ్లి: నటి సబర్న ప్రియుడి కోసం గాలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: సినీ నటి సబర్న మృతి కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మదురవాయల్‌, సీమాత్తమ్మన్‌ నగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నటి సపర్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మదురైవాయల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సినిమా అవకాశాల కోసం సపర్ణ పలుమార్లు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేదని, అప్పుడు అక్కడి ఒక యువకుణ్ని సపర్ణ ప్రేమించినట్లు తెలుసిందని అంటున్నారు. వారు పలు ప్రాంతాలలో దంపతులుగా చెప్పుకుంటూ తిరిగారని సమాచారం. ఆ స్థితిలో నిరుడు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కారణంగా సపర్ణ తన కుటుంబం నుంచి విడిగా ఉంటున్నట్లు సమాచారం.

Police are searching for Sabarna's lover

రెండు నెలలుగా సపర్ణను చూడడానికి ఆమె ప్రియుడు కూడా రావడం లేదని సమాచారం. కనీస ఖర్చులకు కూడా డబ్బు లేక సపర్ణ ఇబ్బంది పడింది. ప్రియుడితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చింది. సపర్ణ మృతి చెందడానికి ముందు ఆమె ప్రియుడు వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. అతడు వెళ్లే సమయంలోనే వారికి వాగ్వివాదం జరిగినట్టు, తనతోనే ఉండాలని ప్రియుణ్ని సపర్ణ బెదిరించినట్టు సమాచారం.

ప్రియుడు హత్య చేసి, ఎలాంటి ఆధారాలూ చిక్కకుండా చేసి మరీ పరారై ఉండవచ్చుననే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకవేళ హత్యలో ప్రియుడికి సంబంధం లేకుంటే ఆమె మృతి తర్వాత ఎందుకు రాలేదనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రియుడి సెల్‌కు పోలీసులు కాల్‌ చేసినప్పుడు స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోంది. దీంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

English summary
Police are searching for tamil Nadu cine actress Sabarna's lover in her death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X