ఇండియన్ ముజాహిదీన్ సాకేంతిక నిపుణుడి అరెస్టు

న్యూఢిల్లీ: కరుడు గట్టిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది ఎజాజ్ షేక్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పలు కేసులతో అతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్‌పూర్‌లో ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు.

జమా మసీదుపై దాడితో పాటు పలు ఉగ్రవాద చర్యల్లో అతను పాల్గొన్నట్లు ప్రత్యేక విభంగా స్పెషల్ కమిషనర్ ఎన్ఎన్ శ్రీవాత్సవ చెప్పారు. అతని అరెస్టును ఆయన ధ్రువీకరించారు. షేక్ పూణేకు చెందినవాడు. ఇండియన్ ముజాహిదీన్ కీలక సభ్యుడైన అతను సాంకేతిక నిపుణుడని చెబుతున్నారు.

police arrests Indian Mujahideen's alleged 'technical expert' from Uttar Pradesh

అతను చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసిన షేక్‌ను పట్టుకున్నారు. షేక్ అరెస్టు ఇండియన్ ముజాహిదీన్‌కు రెండేళ్లలో మరో ఎదురుదెబ్బ. ఈ ఏడాది మార్చిలో పోలీసులు ఇండియన్ ముజాహిదీన్ ఇండియన్ ఆపరేషన్స్ చీఫ్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోనును ఇండో నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు.

ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది జియా ఉర్ రెహ్మాన్ అలియాస వకాస్‌ను ముగ్గురు అనుచరులతో పాటు పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+