వృద్ధుడని కూడా చూడకుండా తలకిందులుగా వేలాడదీసి అమానుషం (వీడియో)
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ కానిస్టేబుల్.. వృద్ధుడిని తీవ్రంగా కొట్టాడు. కాలితో తన్నాడు. ఆ తర్వాత తలకిందులుగా రైల్వే ప్లాట్ ఫాంపై వేలాది దీసి తీవ్రంగా దాడి చేశాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సదరు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

తప్పుగా ప్రవర్తించాడని వృద్ధుడిని దారుణంగా..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ వృద్ధుడు మద్యంమత్తులో సహ ప్రయాణికులతోపాటు సదరు పోలీసుతోనూ తప్పుగా ప్రవర్తించాడు.
దీంతో ఆగ్రహానికి గురైన సదరు కానిస్టేబుల్ అనంత్ మిశ్రా.. ఆ వృద్ధుడిపై తీవ్రంగా దాడి చేశాడు.
వృద్ధుడని చూడకుండా ఈడ్చుకెళ్లి.. తలకిందులుగా చేసి..
30 సెకన్లపాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. సదరు కానిస్టేబుల్.. ఆ వృద్ధుడిని కాలితో తన్నుతూ దూషించాడు. ముఖంపై కొట్టాడు. అంతేగాక, ఆ వృద్ధుడిని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుని వెళ్లి.. రైల్వే ట్రాక్ పై తలకిందులుగా వేలాడదీసి మరీ కాళ్లతో తన్నాడు. ఇదంతా అక్కడే ఆగివున్న రైలులోంచి ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వెలుగు చూసింది.
వీడియో వైరల్ కావడంతో కానిస్టేబుల్ సస్పెండ్
"జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వృద్ధుడిని కానిస్టేబుల్ అనంత్ మిశ్రా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై దర్యాప్తు చేసినప్పుడు.. కానిస్టేబుల్ అనంత్ మిశ్రాను రేవా జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో పోస్ట్ చేసినట్లు తేలింది. కానిస్టేబుల్ అనంత్ మిశ్రాను సస్పెండ్ చేశామని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ప్రతిమా పటేల్ తెలిపారు.
ఆ పోలీసుపై నెటిజన్ల ఆగ్రహం.. చూస్తూ ఉండిపోయిన జనం
వృద్ధుడని కూడా చూడకుండా తీవ్రంగా దాడి చేసిన సదరు కానిస్టేబుల్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అంతేగాక, అక్కడున్నవారంతా చూస్తూ ఉండిపోయారు కానీ.. ఆ కానిస్టేబుల్‌ను అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఏ ఒక్కరూ కూడా చేయకపోవడం శోచనీయం. దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో అరెస్ట్ చేయాలని, ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications