రిసార్ట్ వద్ద ఉద్రిక్తత: కిడ్నాప్ చేశారా.. ఎమ్మెల్యేల్ని ప్రశ్నిస్తున్న పోలీసులు

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వర్గం ఎమ్మెల్యేలను ఉన్న గోల్డెన్ బే రిసార్టు వద్ద బుధవారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాప్రతినిధులను, ఇతర నేతలను రిసార్టు ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు.

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వర్గం ఎమ్మెల్యేలను ఉన్న గోల్డెన్ బే రిసార్టు వద్ద బుధవారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాప్రతినిధులను, ఇతర నేతలను రిసార్టు ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు.

శశికళ లొంగిపోయేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా దాదాపు వంద మంది పోలీసులను రిసార్టు వద్ద ముందస్తుగా ఉంచారు.

తమను రిసార్టులో బలవంతంగా బంధించారని ఎమ్మెల్యే శరవణన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోను పోలీసులు రిసార్టుకు వెళ్లారు.

Police enter resort in TN where Sasikala's MLAs are lodged

రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకుంటున్నారు. బలవంతంగా కిడ్నాప్ చేశారా, లేక స్వచ్చంధంగా వచ్చారా అని పోలీసులు ప్రజాప్రతినిధులను ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. పన్నీర్‌ సెల్వం తిరుగుబాటుతో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. తాజాగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ను నియమించడంతో విభేదాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్తున్న నేపథ్యంలో తనకు నమ్మకంగా ఉండే దగ్గరి బంధువైన దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే 2011లో అమ్మ పార్టీ నుంచి బహిష్కరించిన వ్యక్తికి పార్టీ ఉన్నత పదవి ఎలా కట్టబెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

దినకరన్‌ నియామకాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ అన్నాడీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న పాండ్యన్‌ బుధవారం రాజీనామా చేశారు.

Read in English: Police enter resort in TN
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+