Crime News: నడిరోడ్డుపై దక్షిణ కొరియా యూట్యూబర్‌కు వేధింపులు.. తక్షణమే స్పందించిన పోలీసులు..

దక్షిణ కొరియాకు చెందిన ఒక మహిళా యూట్యూబర్‌ను మంగళవారం ముంబై వీధిలో ఇద్దరు యువకులు వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయితే ఈ ఘటనపై తామే స్వయంగా గమనించి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఇద్దరు యువకులు మోబీన్ చంద్ మహ్మద్ షేక్, మహ్మద్ నకీబ్ సద్రీలం అన్సారీ - అరెస్టు చేశారు. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో యూట్యూబర్‌ను వేధించినందుకు. ఖార్ పోలీసులు ఎఫ్ఐఆర్ u/s 354 IPC నమోదు చేశారు.

దక్షిణ కొరియాకు చెందిన మయోచి అనే యూట్యూబర్‌ మంగళవారం రాత్రి ముంబయిలోని రద్దీగా ఉన్న ఓ వీధిలో లైవ్‌స్ట్రీమ్‌ చేస్తోంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై అక్కడకు వచ్చి లిఫ్ట్‌ ఇస్తామంటూ ఆమె చెయి పట్టుకొని బలవంతంగా లాగారు. దీంతో ఆమె ముందుకు వెళ్లింది.. ఇంతలో ఓ యువకుడు ఆమెని ముద్దుపెట్టుకోబోయాడు. అతడిని వదిలించుకొని మయోచి ముందుకు వెళ్లిపోయింది. ఇదంతా చిత్రీకరించిన ఆదిత్య అనే వ్యక్తి ట్వీట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

Police have arrested the accused who harassed a South Korean YouTuber in Mumbai

బుధవారం ఈ వీడియో వైరల్ అయింది. ఆదిత్య ట్వీట్ ను మయోచి రీట్వీట్ చేశారు. "అక్కడ ఓ యువకుడు నన్ను వేధించాడు. విషయం పెద్దది కాకముందే అక్కడి నుంచి వచ్చేశాను. నేను వీధుల్లో లైవ్‌స్ట్రీమ్‌ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలేమో" అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. దీనికి ముంబయి పోలీసులు ట్విటర్‌ వేదికగా స్పందించారు. మీరు నేరుగా మాకు సమాచారం పంపండి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

"సంఘటన గురించి మేము అప్రమత్తమయ్యాము. వెంటనే, ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించం. మేము వీడియో ద్వారా వారి నిందితులను గుర్తించి.. ఖార్ ప్రాంతంల నివాసముంటున్న నిందితులను అరెస్ట్ చేశారు"అని DCP అనిల్ పరాస్కర్ చెప్పారు. నిందితులను ఐదు నుంచి ఆరు గంటల్లో పట్టుకున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+