పోలీసులు అని నమ్మించి ఫ్రెండ్ ని కట్టేసి యువతికి లైంగిక వేధింపులు, రూ. 20 వేలు!

బెంగళూరు: ఫ్రెండ్ తో కలిసి వెలుతున్న యువతిని తాము పోలీసులు అని నమ్మించి తీసుకెళ్లి చివరికి బెదిరించి లైంగిక దాడి చేసిన ఇద్దరిని కర్ణాటకలోని దావణగెరె పోలీసులు అరెస్టు చేశారు. యువతి, ఆమె స్నేహితుడిని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి మొబైల్ లాక్కొని రూ. 20 వేలు డిమాండ్ చేసిన ఇద్దరిని జైలుకు పంపించారు.

దావణగెరె నగరానికి చెందిన మల్లికార్జున్, దావణగెరె తాలుకా హదడి ప్రాంతానికి చెందిన సురేష్ అనే ఇద్దరిని దావణగెరెలోని ఎస్ వీ. కాన్వెంట్ సమీపంలో అరెస్టు చేశామని దావణగెరె జిల్లా ఎస్పీ హనుమంతరాయ తెలిపారు.

గత నెల 23వ తేదీన దావణగెరెలోని తుంగభద్ర లేఔట్ లోని రామారావ్ నగర్ లో నివాసం ఉంటున్న యువతి స్నేహితుడితో కలిసి వెలుతున్న సమయంలో మల్లికార్జున్, సురేష్ అడ్డగించారు. మేము పోలీసులు, మీరు ఎక్కడికి వెలుతున్నారు ? మిమ్మల్ని విచారణ చెయ్యాలి, పోలీస్ స్టేషన్ కు పదండి అని బెదిరించారు.

Police have arrested two for sexually harrasing girl in the name of police in Karnataka

తరువాత ఇద్దర్నీ నాగనూర్ రోడ్డులోని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లారు. ఇద్దర్నీ వేరువేరు చేసి నిర్బందించారు. యువతి మీద మల్లికార్జున్, సురేష్ లైంగిక దాడి చేశారు. అంతే కాకుండా యువతి బంధువులకు ఫోన్ చేసి ఆమెను విడిచిపెట్టాలంటే రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని సమాచారం.

రూ. 20 వేలు ఇవ్వడానికి తమకు కొంత సమయం కావాలని ఆమె బంధువులు చెప్పడంతో కుదరదు, ఇప్పుడే కావాలని డిమాండ్ చేసి యువతిని లైంగికంగా మరింత వేధింపులకు గురి చేశారు. చివరికి యువతి మొబైల్ లాక్కొని అక్కడి నుంచి మల్లికార్జున్, సురేష్ పరారైనారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో అప్పటి నుంచి గాలించి నిందితులు ఇద్దర్నీ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారని దావణగెరె జిల్లా ఎస్పీ హనుమంతరాయ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+