Sexual assault: రక్షకుడే భక్షకుడు: 13 ఏళ్ల బాలికపై ఈ పోలీస్ పైశాచికత్వం: సెక్స్ ట్రాఫికింగ్

చెన్నై: రక్షకుడే భక్షకుడయ్యాడు. పిల్లల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీస్.. నిందితులతో చేతులు కలిపాడు. పిల్లల అక్రమ రవాణాలో పిన్ పాయింట్ అయ్యాడు. 13 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. చివరికి అతని గుట్టు రట్టయింది. ఎట్టకేలకు పోలీసులు ఇంటిదొంగను అరెస్టు చేశారు. కటకటాల వెనక్కి నెట్టారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరెస్టుతో మరిన్ని డొంకలు కదిలే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. సమాజంలో పెద్దలుగా చలమాణి అవుతోన్న కొందరి వద్దకు బాలికలను సరఫరా చేసే ముఠా గుట్టు బయటపడొచ్చని తెలుస్తోంది.

 క్రైమ్ థ్రిల్లర్‌గా

క్రైమ్ థ్రిల్లర్‌గా

చెన్నైలో చోటు చేసుకున్న ఘటన ఇది. ఆ ఇన్‌స్పెక్టర్ పేరు సీ పుహళేంది. ఎన్నూర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నాడు. సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న ఓ మహిళ.. అతని బండారాన్ని బయట పెట్టారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పుహళేందిని వల పన్ని మరీ పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారం అంతా క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించింది. రెండు నెలల కిందట కనిపించకుండా పోయిన 13 సంవత్సరాల బాలిక తల్లి వాషర్‌మెన్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 రెండు నెలలుగా వ్యభిచార ముఠాలో..

రెండు నెలలుగా వ్యభిచార ముఠాలో..

తన కుమార్తె కనిపించట్లేదంటూ కేసు పెట్టారు. కనిపించకుండా పోయిన ఆ బాలిక వయస్సు 13 సంవత్సరాలే కావడంతో పిల్లల అక్రమరవాణా ముఠా ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తొలుత స్థానికంగా చిన్నపిల్లలను సెక్స్ రాకెట్‌లో దింపే వారి గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో వారు మదన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సెక్స్ రాకెట్ కేసులో మదన్ కుమార్ ఒకసారి అరెస్ట్ అయ్యారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడుదల అయ్యాడు.

కుటుంబం మొత్తం అదే వృత్తిలో

కుటుంబం మొత్తం అదే వృత్తిలో

ఫలితంగా- పోలీసులు దృష్టి అతని మీదే పడింది. వారి గురి తప్పలేదు. అతన్ని తమదైన శైలిలో విచారించగా.. డొంకంత కదిలింది. మదన్ కుమార్ అరెస్టుతో సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. అతని భార్య షహిత బాను, తల్లి సెల్వి ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ఆ ముగ్గురితో పాటు మహేశ్వరి, సంధ్య, విజయ, కార్తీక్, వనితను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వారు తమ నేరాన్ని అంగీకరించారు. 13 సంవత్సరాల బాధిత బాలికను తాము వ్యభిచారం ఉచ్చులో దింపినట్లు చెప్పారు.

ఎస్ఐ అరెస్ట్..

ఎస్ఐ అరెస్ట్..

44 సంవత్సరాల రాజేంద్రన్ అనే వ్యక్తి వద్దకు బాధిత బాలికను తరచూ పంపించే వాళ్లమని సంధ్య వెల్లడించింది. అక్కడే ఎస్‌ఐ పుహళేందికి ఆ బాలికతో పరిచయం ఏర్పడిందని, అతను కూడా తరచూ ఆమెను పిలిపించుకునే వాడని పేర్కొంది. ఆ బాలికను సెక్స్ వర్కర్‌గా మార్చే క్రమంలో మదన్ కుమార్.. పలుమార్లు భౌతిక దాడి చేశాడని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వాషర్‌మెన్ పేట్ పోలీసులు తెలిపారు. తమ కామవాంఛ తీర్చుకోవదానికి రాజేంద్రన్, పుహళేంది తరచూ ఆ బాలికను పిలిపించుకునే వారని వెల్లడించారు.

మరింత లోతుగా దర్యాప్తు..

మరింత లోతుగా దర్యాప్తు..

ఈ కేసులో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న పుహళేందిని అరెస్టు చేశామని, అతణ్ని పుజల్ జైలుకు తరలించామని అన్నారు. ఇదే కేసులో రాజేంద్రన్‌‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సెక్స్ ట్రాఫికింగ్ ముఠాతో సంబంధాలను కొనసాగిస్తోన్న మరో ఆరుమందిని అరెస్టు చేశామని వాషర్‌మెన్ పేట్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. వారి అరెస్టుతో కేసును క్లోజ్ చేయబోవట్లేదని, దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+