Police: అయ్యయ్యో వద్దయ్యా, ఉద్యోగం పోతుంది, సుఖీభవ.... సుఖీభవ, దూలతీరింది, ఏం చేశాడంటే !

చెన్నై: అతను ఓ సీనియర్ పోలీసు అధికారి. అసిస్టెంట్ పోలీసు కమీషనర్ హోదాలో ఉంటున్న ఆ వ్యక్తి డ్యూటీలోనే మద్యం సేవించి జల్సా చేస్తున్నాడు. అన్నట్లు మనోడు మద్యం సేవించాలంటే ఎంటర్మైంట్ కూడా ఉండాలి, లైవ్ లో మ్యూజిక్ వింటూ మద్యం సేవించాలి అనే నియమాలు పెట్టుకున్నట్లు ఉన్నాడు.. అందుకోసం సాటి కానిస్టేబుల్ బాగా పిల్లనగ్రోవి ఊదుతాడని తెలుసుకుని అతన్ని వెంటపెట్టుకున్నాడు. అయితే మద్యం సేవించే సమయంలో అసిస్టెంట్ పోలీసు కమీషనర్ కు అతని ఒంటి మీద డ్రాయర్ తప్పా బట్టలు ఏమాత్రం ఉండటం ఇష్టం లేదని సమాచారం. అందుకే మామిడి తోటలో స్కార్పియో కారు పార్క్ చేసి పక్కనే బట్టలు మొత్తం తీసేసి కేవలం డ్రాయర్ మాత్రమే వేసుకుని అర్దనగ్నం తయారై పక్కన సాటి పోలీసులను పెట్టుకుంటున్న అసిస్టెంట్ కమీషనర్ పీకలదాక మద్యం సేవిస్తూ జల్సా చేస్తున్నాడు.

మనోడి ఘనకార్యం గురించి ఓ సాటి పోలీసు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. సాటి పోలీసులు అయ్యయ్యో ఇలా వద్దయ్యా అంటే పోరారే అని అని చెప్పిన ఆ అసిస్టెంట్ పోలీసు కమీషనర్ కు ఇప్పుడు ఉన్న డ్రాయర్ కూడా ఊడిపోయే పరిస్థితి ఎదురైయ్యింది. ఇంతకాలం అసిస్టెంట్ పోలీసు కమీషనర్ టార్చర్ తట్టుకుని అతనికి సేవలు చేసిన సాటి పోలీసులు ఇప్పుడు సుఖీభవ.... సుఖీభవ.... బాగా జరిగింది అంటున్నారు.

 అసిస్టెంట్ పోలీసు కమీషనర్

అసిస్టెంట్ పోలీసు కమీషనర్

తమిళనాడులోని మధురైలో సాయుధ పోలీసు దళం ( రిజర్వ్ పోలీస్)లో అసిస్టెంట్ పోలీసు కమీషనర్, డీఎస్పీలు, ఇన్స్ పెక్టర్లు, ఎస్ఐలతో పాటు సుమారు వెయ్యి మంది పోలీసులు ఉన్నారు. ఇక్కడే అసిస్టెంట్ పోలీసు కమీషనర్ గా (ACP)సోమసుందరం ఉద్యోగం చేస్తున్నారు. అందు పోలీసు అధికారులుగా కాకుండా సోమసుందరం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించేవాడని ఆరోపణలు ఉన్నాయి.

 డ్యూటీలో మనోడు ఆన్ డ్యూటీ

డ్యూటీలో మనోడు ఆన్ డ్యూటీ

అసిస్టెంట్ పోలీసు కమీషనర్ హోదాలో ఉంటున్న సోమసుందరం ఆ వ్యక్తి డ్యూటీలోనే మద్యం సేవించి జల్సాలు చేస్తున్నాడు. డ్యూటీకి వచ్చే సమయంలో గుడ్ బాయ్ లాగా రావడం, తరువాత ఫుల్ బాటిల్ ఓపెన్ చేసి ఎంతకావాలంటే అంత మద్యం సేవిస్తున్నాడు. అన్నట్లు సోమసుందరం మద్యం సేవించాలంటే ఎంటర్మైంట్ కూడా ఉండాలని నియమాలు కూడా పెట్టుకున్నాడు.

 లైవ్ లో మ్యూజిక్.... నిక్కర్ తప్పా ఏమీ లేవు

లైవ్ లో మ్యూజిక్.... నిక్కర్ తప్పా ఏమీ లేవు

సోమసుందరం లైవ్ లో మ్యూజిక్ వింటూ మద్యం సేవించాలి అనే నియమాలు పెట్టుకున్నట్లు ఉన్నాడు.. అందుకోసం సాటి కానిస్టేబుల్ బాగా పిల్లనగ్రోవి (వేణువు) ఊదుతాడని తెలుసుకున్న సోమసుందరం ఆ పోలీసును అతని వెంటపెట్టుకున్నాడు. మద్యం సేవించే సమయంలో అసిస్టెంట్ పోలీసు కమీషనర్ సోసుందరంకు అతని ఒంటి మీద డ్రాయర్ (నిక్కర్) తప్పా బట్టలు ఏమాత్రం ఉండటం ఇష్టం లేదని సమాచారం.

 పక్కన స్కార్పియో కారు పార్క్ చేసి బిల్డప్

పక్కన స్కార్పియో కారు పార్క్ చేసి బిల్డప్

మామిడి తోటలో స్కార్పియో కారు పార్క్ చేసి పక్కనే బట్టలు మొత్తం తీసేసి కేవలం డ్రాయర్ మాత్రమే వేసుకుని అర్దనగ్నం తయారౌతున్న సోమసుందరం పక్కన సాటి పోలీసులను పెట్టుకుంటున్నాడు. అసిస్టెంట్ కమీషనర్ సోమసుందరం పీకలదాక మద్యం సేవిస్తూ జల్సా చేస్తున్నాడు. అసిస్టెంట్ పోలీసు కమీషనర్ సోమసుందరం సాటి పోలీసులను బానిసలుగా చూస్తున్నాడని సమాచారం.

 ఏసీపీ వీడియో వైరల్

ఏసీపీ వీడియో వైరల్

అసిస్టెంట్ పోలీసు కమీషనర్ సోమసుందరం ఒంటి మీద బట్టలు లేకుండా అర్దనగ్నంగా కుర్చుని మద్యం చేవిస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈ పోలీసు అధికారి చేస్తున్న ఘనకార్యం గురించి ఓ సాటి పోలీసు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. సోమసుందరం విషయం తెలుసుకున్న సాటి పోలీసు అధికారులు షాక్ అయ్యారు.

 అయ్యయ్యో వద్దయ్యా, ఉద్యోగం పోతుంది.... సుఖీభవ..... సుఖీభవ

అయ్యయ్యో వద్దయ్యా, ఉద్యోగం పోతుంది.... సుఖీభవ..... సుఖీభవ

సాటి పోలీసులు సార్ ఇలా చెయ్యకండి అంటూ చాలాసార్లు సోమసుందరంకు చెప్పినా ఆయన వారి మాట వినలేదని తెలిసింది. అప్పుడు అయ్యయ్యో ఇలా వద్దయ్యా అంటే పోరారే అని అని చెప్పిన అసిస్టెంట్ పోలీసు కమీషనర్ సోమసుందరంకు ఇప్పుడు వీడియో వైరల్ కావడంతో ఆయనకు ఉన్న డ్రాయర్ కూడా ఊడిపోయే పరిస్థితి ఎదురైయ్యింది.

Recommended Video

    'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
     విచారణకు ఆదేశం

    విచారణకు ఆదేశం

    మధురై సాయుధ దళాల అసిస్టెంట్ పోలీసు కమీషనర్ సోమసుందరం ఖర్మకాండ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు పోలీసు శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. సోమసుందరం వ్యవహారంపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలిసింది. సోమసుందరం ఉద్యోగానికి ఎసరు వస్తే ఇంతకాలం ఆయన టార్చర్ అనుభవించిన సాటి పోలీసులు సుఖీభవ.... సుఖీభవ అంటూ పండుగ చేసుకుంటారని తెలిసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+