పోర్న్ వీడియోలు చూశారో అంతే సంగతులు.. మీకు మేసెజ్... అక్కడ పైలట్ ప్రాజెక్టు

టెక్నాలజీ తెచ్చిన తంటా.. మంచి ఒకటి ఉంటే.. చెడు రెండు ఉంటాయి. అందులో పోర్న్ ముందువరసలో ఉంది. కొన్ని సైట్లను బ్యాన్ చేసినా.. మరికొన్ని మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. దీంతో యువత పెడతోవ పడుతున్నారు. చిన్న వయసులోనే నేరాలు చేస్తున్నారు. పోర్న్‌పై నిఘా పెట్టాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావించారు. ఆ మేరకు కసరత్తు చేశారు.

నెట్‌లో పోర్న్‌ వీడియోలు చూసేవారిపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నిఘా పెడతారు. ఎవరైనా పోర్న్‌కు సంబంధించిన విషయాలను ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేస్తే యూపీ ఉమెన్‌ పవర్‌లైన్‌ 1090కు అలర్ట్‌ వెళ్తుంది. 1090 నుంచి సదరు వ్యక్తికి అవగాహాన కల్పించే విధంగా ఓ మెసేజ్‌ వస్తుంది. ఆరు జిల్లాల్లో విజయవంతమైన ఈ ప్రాజెక్టుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమల్లోకి తీసుకురానున్నారు.

police monitor people internet search history..

నెట్‌ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో మహిళలపై నేరాలు అరికట్టడానికి 1090 దోహదపడుతుందని ఏడీజీ నీరా రావత్‌ అన్నారు. డేటా యూసేజ్‌ ఆధారంగా ప్రజలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారనే అంశంపై ఓ కన్నేసి ఉంచుతున్నామని తెలిపారు. ఎవరైనా పోర్న్‌కు సంబంధించిన విషయాలు సెర్చ్‌ చేస్తే 1090కు సమాచారం అందుతుందన్నారు. వారికి అవగాహన కల్పించే విధంగా ఓ మెసేజ్‌ వెళుతుందని.. వారి డేటా పోలీసులు, 1090 వద్ద నిక్షిప్తమయి ఉంటుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+