బిచ్చగాళ్లకు డబ్బులు ఇస్తే.. ఇక మీరు జైలుకే!
బిచ్చగాళ్లకు డబ్బులు ఇస్తున్నారా? అయితే మీపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇది ఎక్కడో కాదు ఇండియాలోనే. మధ్యప్రదేశ్లోని ఇండోర్‌లో పూర్తిగా భిక్షాటనను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని 2025 జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్‌ను యాచక రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. యాచకులకు డబ్బులు ఇచ్చే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. బిచ్చగాళ్లకు డబ్బులు ఇస్తున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
ఎందుకు ఈ నిర్ణయం?
కొంతమంది యాచకులు భిక్షాటనను వృత్తిగా మార్చుకున్నారు. అయితే వారికి శాశ్వత నివాసాలు , ఇతర వనరులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. కొందరు పిల్లలను ఉపయోగించి భిక్షాటన చేయిస్తున్న ముఠాలు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. ఇండోర్ జిల్లా యంత్రాంగం నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు ఈ చర్య తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్‌ను యాచక రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగా దీనిని చేపట్టారు.

ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏమిటి?
కొత్త నిబంధనలను అమలు చేయడానికి మార్కెట్లు, దేవాలయాలు మరియు రవాణా కేంద్రాలు వంటి రద్దీ ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాలను పోలీసు బృందాలు పర్యవేక్షిస్తాయి. కాబట్టి, మీరు ఇండోర్‌లో ఉంటే లేదా వెళ్లాలనుకుంటే, బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం మానుకోండి. తద్వారా నగరాన్ని యాచకరహితంగా మార్చడంలో సహాయపడుతున్నవారుగా ఉంటారు..
యాచకులకు ఉపాధిలో శిక్షణ.
యాచకులకు ఆశ్రయం కల్పించడానికి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ యాచకులకు ఆరు నెలల పాటు ఆశ్రయం ఇవ్వడంతో పాటు అర్హులైన వారికి వివిధ పనులలో శిక్షణ ఇస్తుంది. అటు నగరాన్ని యాచకరహితంగా మార్చడానికి ప్రజల సహకారం కూడా అవసరం. ప్రజలు బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం మానుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ దేశంలోని ఇతర నగరాల్లో కూడా అమలు చేయబడుతోంది. ఆ నగరాల జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పట్నా, అహ్మదాబాద్ ఉన్నాయి. త్వరలోనే ఈ నగరాల్లో కూడా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications