ఆసియానెట్ న్యూస్ ఛానెల్ కార్యాలయంలో పోలీసుల సోదాలు: ఎస్ఎఫ్ఐ నిరసన తర్వాత
కొచ్చి:కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని ఆసియానెట్ న్యూస్ ఛానెల్ కార్యాలయాల్లో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తా కథనాన్ని ఆ ఛానెల్‌లో ప్రసారం చేసిన రెండు రోజుల తరువాత ఈ దాడులు జరిగాయని సదరు మీడియా సంస్థ తెలిపింది.
కేరళ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ సభ్యులు నిరసనల నేపథ్యంలోనే పోలీసులు సోదాలు నిర్వహించారని పేర్కొంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసుల చర్య వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) కార్యకర్తల బృందం శుక్రవారం కోజికోడ్‌లోని మలయాళ వార్తా ఛానెల్ ఆసియానెట్ న్యూస్ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి, ప్రసారమైన వార్తా నివేదికపై సిబ్బందిని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
Kerala | A team of Crime Branch, Kerala Police at Kozhikode office of Asianet News to investigate a case relating to an alleged "fake news" story published by them. Case registered in the matter pic.twitter.com/0gFqtO5bud
— ANI (@ANI) March 5, 2023
టీవీ ఛానల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లేదా సీపీఐ(ఎం) విద్యార్థి విభాగం అయిన ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన దాదాపు 30 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం.. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు రాత్రి 8 గంటలకు కార్యాలయంలోకి ప్రవేశించారని, సెక్యూరిటీ సిబ్బందిని పక్కకు నెట్టి, సంస్థ ఉద్యోగులను బెదిరించి న్యూస్ ఛానెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు.
This is what we stand for! And that will never change!
— Rajesh Kalra (@rajeshkalra) March 5, 2023
Straight Bold Relentless
നേരോടെ നിർഭയം നിരന്തരം
ನೇರ ದಿಟ್ಟ ನಿರಂತರ
நேர்மைbதுணிவு பாரபட்சமின்மை
నిజాయితీ నిర్భయం అలుపెరుగనితనం
সোজাসাপটা সোজাসাপটা নিরলস
सटीक बेबाक बेधड़क@AsianetNewsML #AsianetNews @AsianetNews https://t.co/bsrAAcatOS
ఉత్తర కేరళలోని ఒక పాఠశాలలో 10 మందికి పైగా బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మైనర్ బాలికను ఉపయోగించి "నకిలీ వార్తలు" సృష్టించినట్లు న్యూస్ ఛానెల్‌పై ఫిర్యాదు ఉందని సీపీఐ(ఎం) వర్గాలు శనివారం ఆరోపించాయి. ఎస్‌ఎఫ్‌ఐ ఎర్నాకులం జిల్లా కమిటీకి చెందిన వర్గాలు ఈ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశాయి. నకిలీ వార్తలకు నిరసనగా విద్యార్థి సంఘం మీడియా సంస్థ కొచ్చి కార్యాలయానికి మార్చ్ నిర్వహించింది.
So @pinarayivijayan facing serious corruptn charges n questns from media thinks he can wriggle out n distract ppl by intimidatng media using his SFI hoodlums n thn his Police 😂🤷🏻♂️ #Joker https://t.co/FFjLoJvas2
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) March 5, 2023
కేరళ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిపై గత ఏడాది తన కార్యక్రమంలో భాగంగా న్యూస్ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. ఎస్ఎఫ్ఐ చర్యను విమర్శిస్తూ.. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరింది. మీడియా సంస్థ కార్యాలయంలోకి వచ్చి బెదిరింపులకు పాల్పడటం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications