వరదబాదితుల కిట్ లాక్కున్న ఎస్ఐ సార్!

చెన్నై: వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డునపడిన ఓ వృద్దురాలి దగ్గర ఉన్న రిలీఫ్ కిట్ (సహాయ సామాగ్రి)ని ఓ పోలీసు అధికారి బలవంతంగా లాక్కున్నాడు. ఆ సందర్బంలో వెనుక నుంచి ఎవరో దానిని వీడియో తీసి పోలీసులకు బుద్ది చెప్పారు.

ఈ దెబ్బతో చెన్నై పోలీసులు చిక్కుల్లో పడ్డారు. చెన్నైలోని ఎంజీ నగర్ కాలనీలో సర్వం కోల్పోయిన వారికి సహాయం చెయ్యడానికి కొందరు వాలంటీర్లు ముందుకు వచ్చారు. ఇటీవల ఆ కాలనీలో రిలీఫ్ కిట్ లు పంపిణి చేశారు.

కాలనీలోని పెరియార్ కోవిల్ స్ట్రీట్ లో కిట్ లు పంపిణి చేస్తున్న సమయంలో స్పెషల్ బ్రాంచ్ లో ఎస్ఐగా పని చేస్తున్న కుమార్ బైక్ లో అక్కడికి వెళ్లాడు. రిలీఫ్ కిట్ తీసుకుని వెళుతున్న ఓ వృద్దురాలి దగ్గర ఆ కిట్ లాక్కొన్నాడు.

Police snatches relief kit from flood victims in Chennai

ఆమె వద్దు సార్ అంటున్నా ఎస్ ఐ వినకుండా కిట్ తీసుకుని బైక్ లో దర్జాగా పరారైనాడు. ఆ సందర్బంలో వెనుక ఉన్న ఓ వ్యక్తి మొబైల్ లో ఆ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. 20 సెకన్లు ఉన్న ఆ వీడియో పోలీసుల దౌర్జన్యానికి అద్దం పడుతున్నదని పలువురు మండిపడ్డారు.

ఓ వృద్దురాలి పట్ల ఎస్ఐ ఇలా ప్రవర్తించడం తనను చాల ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ వాలంటీర్ మీడియాతో ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసు అధికారులు అంటున్నారు.

ఈ విషయంపై చెన్నై నగర పోలీసు కమిషనర్ టీ.కే. రాజేంద్రన్ స్పందించారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. వీడియో చూసిన తరువాత కుమార్ మీద చర్యలు తీసుకుంటామని రాజేంద్రన్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+