వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి అల్కా అదృశ్యం: చెన్నైలో దొరికిన ఆచూకీ, డ్రామా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: పన్నెండు రోజుల క్రితం అదృశ్యమైన మరాఠీ నటి అల్కా పునేవర్ తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించనట్లుగా తెలుస్తోంది. అల్కా కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఆమె ఆచూకీ కోప్రీ పోలీసులకు తెలిసినట్లుగా సమాచారం. కుటుంబ సమస్యలతోనే ఆమె మిస్సింగ్ డ్రామా ఆడినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు ప్రియుడితో కలిసి గడిపేందుకు వ్యూహ రచన చేసి కారును లోయలో నెట్టేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందట. వారిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

కాగా, డిసెంబర్ 27వ తేదీన ఇంటి నుండి వెళ్లిన మరాఠీ నటి అల్కా పునేవర్(49) తిరిగి రాలేదని ఆమె భర్త సంజయ్ పునేవర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ముంబై - పుణే రోడ్డులోని ఖోపోలి సమీపంలో ఆమె కారును పోలీసులు గుర్తించారు.

Police traces missing Marathi actress Alka Punewar in Chennai

ఖొబపోలి సమీపంలో ఏడువందల అడుగుల లోతైన లోయలో ధ్వంసమై పడి ఉన్న అల్కా కారును డిసెంబర్ 30వ తేదీన పోలీసులు గుర్తించారు. కారులో ఆమె సెల్‌ఫోన్, బ్యాగు ఉన్నాయి. అయితే, అల్కా ఆచూకీ లభించలేదు. అల్కా భర్త సంజయ్ ఫిర్యాదు మేరకు కోప్రి పోలీసులు ఐదు రోజుల క్రితం కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు. ఆమె గురించి గాలించారు.

అల్కాను తాను థానే రైల్వే స్టేషన్లో తన కారులో దింపానని, అక్కడే ఆమెను వారి డ్రైవర్ పికప్ చేసుకున్నాడని, అరగంట తర్వాత తన భార్య తనకు ఫోన్ చేసి డ్రైవర్ పికప్ చేసుకున్నాడని, తాము వెళ్తున్నామని చెప్పిందని భరత్ సంజయ్ చెప్పాడు. అయితే, డిసెంబర్ 28న మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ వచ్చిందని, అల్కా ఇంటికి చేరిందా అని ప్రశ్నించారని, అయితే తాను అల్కాకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదని సంజయ్ చెప్పారు.

English summary
Marathi actress Alka Punewar, who went "missing" from Thane since December 28, 2013, has been to Chennai, police sources said on Tuesday. The Kopri police detained her driver, after which her whereabouts were traced, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X